Vijay Deverakonda : కరోనా టైంలో విజయ్ దగ్గర మనీ లేక.. దిల్ రాజు దగ్గర అప్పు తీసుకున్నారట..

కరోనా టైంలో విజయ్ దగ్గర మనీ లేక దిల్ రాజు దగ్గర అప్పు తీసుకున్నారట. ఆ అప్పు తీర్చడం కోసం..

Vijay Deverakonda : కరోనా టైంలో విజయ్ దగ్గర మనీ లేక.. దిల్ రాజు దగ్గర అప్పు తీసుకున్నారట..

Vijay Deverakonda said he take debt from dil raju in carona days

Updated On : April 1, 2024 / 3:16 PM IST

Vijay Deverakonda : దిల్ రాజు నిర్మాణంలో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ హీరోహీరోయిన్స్ గా నటించిన కొత్త సినిమా ‘ఫ్యామిలీ స్టార్’. పరుశురాం డైరెక్ట్ చేసిన ఈ చిత్రం మరో నాలుగు రోజుల్లో థియేటర్స్ లోకి రాబోతుంది. దీంతో మూవీ టీం అంతా ప్రమోషన్స్ తో సందడి చేస్తున్నారు. విజయ్, మృణాల్, దిల్ రాజు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సందడి చేస్తున్నారు. ఈక్రమంలోనే తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను ఫ్యాన్స్ కి తెలియజేసారు.

విజయ్ దేవరకొండ ఈ సినిమా కంటే ముందుగా గౌతమ్ తిన్ననూరి చిత్రం చేయాల్సి ఉంది. విజయ్ కెరీర్ లోనే ఈ సినిమా భారీ ప్రాజెక్ట్ గా రాబోతుంది. ఈ మూవీ పై విజయ్ ఫ్యాన్స్ లో భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ సినిమా పనులను కూడా స్టార్ట్ చేసి షూటింగ్ కి సిద్ధమయ్యారు. కానీ సడన్ గా ఫ్యామిలీ స్టార్ ని లాంచ్ చేయడం, షూటింగ్ పూర్తి చేయడం, రిలీజ్ కి సిద్ధం చేయడం జరిగిపోయింది.

Also read : Chiranjeevi – Ram Charan : చూసుకోరు వెధవలు.. చరణ్‌ని అంత మాట అనేశాడేంటి చిరంజీవి.. మిడిల్ క్లాస్ కష్టాలు చెప్తూ..

ఫ్యామిలీ స్టార్ వల్ల గౌతమ్ తిన్ననూరి మూవీ పెండింగ్ లో పడింది. అయితే ఈ సినిమా పక్కన పెట్టి ఫ్యామిలీ స్టార్ చేయడానికి.. దిల్ రాజు దగ్గర విజయ్ చేసిన అప్పు కారణం అని తెలుస్తుంది. కరోనా సమయంలో విజయ్ దగ్గర అసలు డబ్బులు లేవంట. దీంతో దిల్ రాజు దగ్గరికి వెళ్లి.. “మీకు సినిమా చేస్తాను. నాకు కొంచెం డబ్బుని అడ్వాన్స్ గా ఇవ్వండి” అని రిక్వెస్ట్ చేశారట.

దిల్ రాజు సాధారణంగా ఎవరికి అడ్వాన్స్ లు ఇవ్వరు. సినిమా స్టార్ట్ అయిన తరువాతే ఎవరికైన మనీ ఇస్తారు. కానీ విజయ్ రిక్వెస్ట్ చేయడంతో దిల్ రాజు కొంత మనీ ఇచ్చారంట. అందుకనే ఫ్యామిలీ స్టార్ కి ఓకే చెప్పరు. గౌతమ్ తిన్ననూరితో చేసే సినిమా భారీ స్కేల్ లో ఉంటుంది. అది పూర్తి అయ్యేపాటికి చాలా సమయంలో పడుతుంది. అప్పటివరకు దిల్ రాజుని వెయిట్ చేయించలేక, విజయ్ ఫ్యామిలీ స్టార్ ని స్టార్ట్ చేసి శరవేగంగా పూర్తి చేసారు.