Vijay Title Card: విజయ్ లాస్ట్ సినిమా ‘జన నాయగన్’ రిలీజ్.. హీరో టైటిల్ కార్డ్ అదిరిందిగా.. వేరే లెవల్ అయ్యా..
Vijay Title Card: విజయ్ కెరీర్ లోనే బెస్ట్ టైటిల్ కార్డు 'లియో' సినిమా.
Vijay Jana Nayagan Movie Hero Title Card Video
Vijay Title Card : తమిళ్ స్టార్ హీరో విజయ్ పాలిటిక్స్ లోకి వెళ్లడంతో తన లాస్ట్ సినిమా జన నాయగన్ (Jana Nayagan) అని ప్రకటించారు. ఇక విజయ్ సీఎం అవ్వడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పలుమార్లు పొలిటికల్ ఇబ్బందులతో వాయిదా పడిన జన నాయగన్ సినిమా ఎట్టకేలకు నేడు జులై 23న థియేటర్స్ లో రిలీజ్ అయింది.
విజయ్ సినిమాల్లో టైటిల్ కార్డ్స్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. విజయ్ సినిమాలను చూసి వేరే హీరోలు, మన టాలీవుడ్ హీరోలకు కూడా సినిమాల్లో ఇంట్రడక్షన్ టైటిల్ కార్డ్స్ ని కొత్తగా చూపిస్తున్నారు. దీంతో విజయ్ లాస్ట్ సినిమాకు ఎలాంటి హీరో టైటిల్ కార్డు వేస్తారో అని ఫ్యాన్స్ ఎదురుచూసారు. విజయ్ కెరీర్ లోనే బెస్ట్ టైటిల్ కార్డు ‘లియో’ సినిమా.
ఇప్పుడు జన నాయగన్ సినిమాకు లియో టైటిల్ కార్డు గ్రాఫిక్స్ తీసుకొని విజయ్ అసెంబ్లీలో చేసిన ఓ పవర్ ఫుల్ సిగ్నేచర్ మూమెంట్ ని పెట్టారు. తమిళనాడు మాజీ సీఎం స్టాలిన్ ఓ మీటింగ్ లో విజయ్ ని కామెంట్స్ చేస్తూ చెయ్యి చూపిస్తూ నీ పని అయిపొయింది అన్నారు. దానికి కౌంటర్ గా విజయ్ అసెంబ్లీలో అంతా అయిపొయింది అన్నట్టు చెయ్యి చూపిస్తూ స్టాలిన్ ని ఇమిటేట్ చేసాడు. దీంతో విజయ్ అసెంబ్లీలో కౌంటర్ ఇవ్వడంతో అది సిగ్నేచర్ మూమెంట్ లా మారి వైరల్ అయింది.
ఇప్పుడు జన నాయగన్ సినిమాకు అదే హీరో టైటిల్ కార్డులా వాడటం గమనార్హం. ఆ సిగ్నేచర్ మూమెంట్ మాత్రమే చూపించడం కాక హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తమిళనాడు C జోసెఫ్ విజయ్ అని టైటిల్ వేశారు. దీంతో విజయ్ ఫ్యాన్స్ అయితే పండగ చేసుకుంటున్నారు. కానీ ప్రతిపక్షాలు సీఎం పోస్ట్ ని అలా టైటిల్ వేయడం ఏంటి అని విమర్శలు చేస్తున్నారు. ఈ టైటిల్ కార్డుతో విజయ్ అభిమానులు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే తమిళనాడులో పలు షోలు పడగా ఈ టైటిల్ కార్డు వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Vere level title card #JanaNayagan pic.twitter.com/5p7DrQ8dhw
— Sasank ᴼᴳ (@Sasankanupama) July 23, 2026
ഇജ്ജതി TITLE CARD. 😮💨❤️🔥👑#JanaNayagan pic.twitter.com/rwhPhqIBIA
— ImJish (@Jizhnu007) July 23, 2026
