Vishwak Sen : టాలీవుడ్లో మరో సినిమాటిక్ యూనివర్స్.. అనౌన్స్ చేసిన విశ్వక్ సేన్..
అనేకమంది దర్శకులు తమ సినిమాలతో సినిమాటిక్ యూనివర్స్ లు ప్రకటిస్తున్నారు. (Vishwak Sen)
Vishwak Sen
Vishwak Sen : హాలీవుడ్ హిట్ ఫార్ములా మార్వెల్, డీసీ యూనివర్స్ తరహాలో ఇక్కడ భారత సినిమాల్లో కూడా సినిమాటిక్ యూనివర్స్ లు వస్తున్నాయి. కొంతమంది దర్శకులు పలు సినిమాలను, అందులోని పాత్రలను కలుపుతూ సినిమాటిక్ యూనివర్స్ లు మొదలు పెట్టారు. ఇప్పటికే టాలీవుడ్ లో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్, సుజీత్ ఓజి, సాహో, రాబోయే సినిమాలతో కలిపి సుజీత్ సినిమాటిక్ యూనివర్స్, నాగ్ అశ్విన్ కల్కి సినిమాటిక్ యూనివర్స్ లు ప్రకటించారు. హిందీలో యశ్ రాజ్ ఫిలిమ్స్ స్పై సినిమాలని కలుపుతూ స్పై యూనివర్స్ చేస్తుంది. తమిళ్ లో లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ పై అయితే భారీ అంచనాలే ఉన్నాయి.
ఇలా అనేకమంది దర్శకులు తమ సినిమాలతో సినిమాటిక్ యూనివర్స్ లు ప్రకటిస్తున్నారు. ఈ బాటలోకి విశ్వక్ సేన్ కూడా చేరాడు. విశ్వక్ సేన్ దర్శకుడిగా, హీరోగా నేడు కల్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమాలో హింస ఎక్కువ ఉన్నా ప్రీ ఇంటర్వెల్ నుంచి ఆసక్తిగానే ఉంది. ఈ సినిమా చివర్లో పార్ట్ 2 ‘సంకి’ అనే టైటిల్ తో అనౌన్స్ చేసి కల్ట్ సినిమాటిక్ యూనివర్స్ అని అధికారికంగానే ప్రకటించాడు.
Also See : Samantha : 9వ నెల బేబీ బంప్‌తో సమంత ఎక్సర్ సైజ్లు.. ఫోటోలు వైరల్..
కల్ట్ సినిమాలో విశ్వక్ సేన్ గోవాలో DSP సంకల్ప్ నాయక్ అలియాస్ సంకి పాత్ర చేసాడు. ఈ సినిమా గోవాలో డ్రగ్స్ దందా, నాన్ లోకల్స్ లోకల్ వాళ్ళని మోసం చేయడం, ఓ పొలిటీషియన్ కొడుకు ఘోరాలతో, LGBT కాన్సెప్ట్, మెంటల్ హాస్పిటల్.. పలు అంశాలతో సాగింది. వీటిలోని పాత్రలు, కథలతో ఈ కల్ట్ సినిమాటిక్ యూనివర్స్ ఉంటుందని సమాచారం.
విశ్వక్ సన్నిహితుల సమాచారం మేరకు.. కల్ట్ సినిమాలో గోవాలో ఒక సినిమా షూటింగ్ జరుగుతున్నట్టు, ఆ షూటింగ్ మధ్యలోకి ముగ్గురు అబ్బాయిలు వెళ్లినట్టు చూపించారు. ఈ సినిమాటిక్ యూనివర్స్ లో ఆ సినిమా షూటింగ్, దాని వెనక జరిగే కథని సపరేట్ సినిమాగా మలుస్తాడని టాక్ వినిపిస్తుంది. మొత్తానికి హీరోగా సక్సెస్ అవుతూనే దర్శకుడిగా కూడా సక్సెస్ లు కొడుతూ ఇప్పుడు సినిమాటిక్ యూనివర్స్ ప్రకటించి చర్చగా మారాడు విశ్వక్.
