Vishwak Sen : విశ్వక్ సేన్ ఆడిషన్ ఇచ్చిన సినిమాకి.. నాగచైతన్య హీరోగా సెలెక్ట్.. ఏ మూవీ..?

విశ్వక్ సేన్ ఆడిషన్ ఇచ్చిన సినిమాకి నాగచైతన్య హీరోగా సెలెక్ట్ అయ్యారట. అది ఏ సినిమా అంటే..

Vishwak Sen : విశ్వక్ సేన్ ఆడిషన్ ఇచ్చిన సినిమాకి.. నాగచైతన్య హీరోగా సెలెక్ట్.. ఏ మూవీ..?

Vishwak Sen gave audition for Naga Chaitanya acted movie

Vishwak Sen : టాలీవుడ్ యువ హీరో విశ్వక్ సేన్.. ప్రస్తుతం వరుస సినిమాలను లైన్ లో పెడుతూ ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. నటుడు గానే కాకుండా దర్శకుడిగా కూడా ఆడియన్స్ ని అలరిస్తూ వస్తున్నారు. కాగా ఈ హీరో తాజాగా ఓ తెలుగు యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు. ఇక ఆ ప్రోమో చూస్తుంటే.. ఇంటర్వ్యూలో చాలా ఆసక్తికర విషయాలు ఉన్నట్లు తెలుస్తుంది.

కాగా ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో ఓ ఇంటరెస్టింగ్ టాపిక్ ని మాట్లాడారు. విశ్వక్ సేన్ ఆడిషన్ ఇచ్చిన సినిమాకి నాగచైతన్య హీరోగా సెలెక్ట్ అయ్యారట. అది ఏ సినిమా అంటే.. నాగచైతన్య హీరోగా ఎంట్రీ ఇస్తూ తన యాక్టింగ్ కెరీర్ ని స్టార్ట్ చేసిన ‘జోష్’. దిల్ రాజు నిర్మాణంలో వాసు వర్మ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా 2009లో ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోలేకపోయినా.. మంచి రివ్యూలను అయితే సంపాదించుకుంది.

Also read : OY Re Release : మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి.. అక్కడికే సిద్ధార్ధని తీసుకొస్తా.. ‘ఓయ్’ రీ రిలీజ్‌ స్పెషల్ షోపై డైరెక్టర్ ట్వీట్

ఇప్పటి జనరేషన్ ఆడియన్స్.. ఈ సినిమాని బాగా లైక్ చేస్తుంటారు. ఇప్పుడు వచ్చి ఉంటే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకునేది అంటూ పలువురు కామెంట్స్ చేస్తుంటారు. అలాంటి ఈ సినిమాని కొత్తవారితో చేయాలని దిల్ రాజు భావించారు. ఈక్రమంలోనే ఆ సమయంలో కొత్త నటీనటులు కావాలంటూ ప్రకటన కూడా ఇచ్చారు. ఇక అదే సమయంలో యాక్టర్ గా కెరీర్ ని ఎంచుకున్న విశ్వక్ సేన్.. తన మొదటి ఆడిషన్ ని జోష్ మూవీ కోసమే ఇచ్చారట.

అయితే ఆ ఆడిషన్ లో విశ్వక్ సెలెక్ట్ అవ్వలేదు. మరి ఆయన సెలెక్ట్ అవ్వకపోవడానికి గల కారణం ఏంటి..? అసలు విశ్వక్ ఆడిషన్ ఇచ్చింది ఏ పాత్ర కోసం..? అనేవి తెలియాలంటే పూర్తి ఇంటర్వ్యూ చూడాల్సిందే. ఇక ఇదే ఇంటర్వ్యూలో తన డైరెక్టర్ గా మారడం గురించి, అలాగే అర్జున్ సర్జాతో గొడవ గురించి కూడా మాట్లాడినట్లు తెలుస్తుంది.