Chiranjeevi : చిరంజీవి గెస్టుగా ఆహా సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్‌.. ఎక్కడ..? ఎప్పుడు..?

చిరంజీవి గెస్టుగా ఆహా సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్‌ గ్రాండ్ గా జరగబోతుంది. ఈ సినిమా ఉత్సవంలో..

Chiranjeevi : చిరంజీవి గెస్టుగా ఆహా సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్‌.. ఎక్కడ..? ఎప్పుడు..?

Vishwambhara star Chiranjeevi is chief guest for south India film festival

Chiranjeevi : సౌత్ ఇండియా ఫిల్మ్ ఫెస్టివల్ తొలి వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా వెళ్ళబోతున్నారు. టాలీవుడ్ లోని రెండు బడా సంస్థలుగా గుర్తింపు సంపాదించుకున్న ఆహా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ ఫెస్టివల్ ని మొదటిసారిగా కండక్ట్ చేస్తున్నారు. ఇక ఈ ఈవెంట్ లో సౌత్ ఇండస్ట్రీలోని టాప్ స్టార్స్ అంతా పాల్గొనబోతున్నారు. ఈ ప్రెస్టీజియస్ కార్యక్రమాన్ని లెెజెండ్రీ యాక్టర్ మెగాస్టార్ చిరంజీవి గెస్టుగా నిర్వహిస్తున్నారు.

ఈ సినిమా ఉత్సవం మార్చి 22న హైదరాబాద్ నోవాటెల్ హోటల్‌లో గ్రాండ్ గా జరగబోతుంది. సౌత్ సినీ సెలబ్రిటీస్ పాల్గొనే ఈ ఈవెంట్ కోసం ఆడియన్స్ అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ ఈవెంట్ లో నటీనటులతో అద్భుతమైన డాన్స్ పర్ఫామెన్స్ లు కూడా ఉండబోతున్నాయి. రీసెంట్ యంగ్ సెన్సేషన్, చిరంజీవికి వీరాభిమాని అయిన తేజ సజ్జా.. మెగాస్టార్ కి ట్రిబ్యూట్ గా అదిరిపోయే డాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోతున్నారు.

Also read : Double Ismart : డబుల్ ఇస్మార్ట్ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన రామ్.. మళ్ళీ అదే సమయంలో..

ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘విశ్వంభర’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. వశిష్ఠ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ప్రస్తుతం ఈ మూవీ మ్యూజిక్ సిట్టింగ్స్ జరుగుతున్నాయి. ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఈ మ్యూజిక్ సిట్టింగ్స్ కి సంబంధించిన లేటెస్ట్ ఫొటోని నేడు హీరోయిన్ త్రిష అభిమానులతో పంచుకున్నారు.