Vijay- Ntr: తమిళనాట విజయ్ ప్రభంజనం.. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న ఎన్టీఆర్
తమిళనాడులో విజయ్(Vijay- Ntr) విజయంతో తెలుగునాట ఎన్టీఆర్ పేరు నెట్టింట వైరల్ అవుతోంది.
With Vijay success in Tamil Nadu, NTR name is trending on social media.
- విజయ్ విజయంతో ఎన్టీఆర్ చర్చ.
- నెట్టింట ఫ్యాన్స్ రచ్చ
- రాజకీయ రాక కాలమే నిర్ణయించాలన్న ఎన్టీఆర్.
Vijay- Ntr: తమిళనాడు రాజకీయాల్లో నటుడు విజయ్(Vijay- Ntr) తన ‘TVK’ పార్టీతో సృష్టించిన సంచలనం ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చకు దారితీసింది. విజయ్ సాధించిన అనూహ్య విజయం చూశాక, టాలీవుడ్ ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ ఎన్టీఆర్ కూడా రాజకీయాల్లోకి రావాలని ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా గట్టిగా కోరుకుంటున్నారు. తన తాత నందమూరి తారకరామారావు వారసత్వాన్ని అందిపుచ్చుకుని, తారక్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే ఇక్కడ కూడా అదే స్థాయి ప్రభంజనం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.
Anarkali Nazar: గోపీచంద్ కొత్త మూవీ ఓపెనింగ్ లో అనార్కలి నాజర్.. క్యూట్ ఫోటోలు వైరల్
అయితే, ఈ రాజకీయ ప్రవేశంపై ఎన్టీఆర్ చాలా స్పష్టమైన వైఖరితో ఉన్నారు. తనకు ప్రస్తుతం ఓట్ల కంటే అభిమానుల ప్రేమే ముఖ్యమని, వారు తన సినిమా టిక్కెట్లు కొంటే చాలని ఆయన గతంలోనే తేల్చి చెప్పారు. రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుండి వచ్చినప్పటికీ, ప్రస్తుతానికి తన పూర్తి దృష్టి కేవలం సినిమాలపైనే ఉందని ఆయన పలు ఇంటర్వ్యూలలో స్పష్టం చేశారు. నటుడిగా తానూ ఎంతో సంతృప్తిగా ఉన్నానని, పాలిటిక్స్ వైపు వెళ్లే ఆలోచన ఇప్పుడప్పుడే లేదని ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది. మరి అభిమానుల ఆకాంక్షను ఎన్టీఆర్ పరిగణంలోకి తీసుకుంటాడా అనేది చూడాలి మరి.
సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ సినిమా చేస్తున్నాడు. అంతర్జాతీయ స్థాయిలో తన మార్కెట్‌ను విస్తరించుకునే పనిలో ఉన్నారు. విజయ్ విజయం తెలుగు నాట కొత్త చర్చకు తెరలేపినప్పటికీ, తారక్ భవిష్యత్తులో తన నిర్ణయాన్ని మార్చుకుని రాజకీయాల్లోకి వస్తారా లేదా నటనకే పరిమితం అవుతారా అన్నది కాలమే నిర్ణయించాలి. ప్రస్తుతానికి మాత్రం ఆయన ఫోకస్ మొత్తం వెండితెరపైనే ఉంది.
