రుక్మిణి వసంత్ కి రూ.3కోట్లు, నయనతారకి రూ.12 కోట్లు.. కియారా, యష్ కి అయితే ఏకంగా.. టాక్సిక్ తారలకు భారీ భారీ రెమ్యునరేషన్లు
తాజాగా ఈ సినిమా బడ్జెట్ లో రెమ్యునరేషన్స్ కే భారీగా ఖర్చు అవుతున్నట్టు తెలుస్తుంది. (Toxic)
Toxic
Toxic : కెజిఎఫ్ సినిమా తర్వాత యశ్ హీరోగా భారీగా తెరకెక్కుతున్న సినిమా టాక్సిక్. మలయాళ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో భారీగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకు దాదాపు 500 కోట్లకు పైగా భారీ బడ్జెట్ పెడుతున్నారు. అడల్ట్, వైలెన్స్ కథాంశంతోనే ఈ సినిమా తెరకెక్కుతుంది అని తెలుస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు గ్లింప్స్, ఒక సాంగ్ రిలీజ్ చేసారు.
తాజాగా ఈ సినిమా బడ్జెట్ లో రెమ్యునరేషన్స్ కే భారీగా ఖర్చు అవుతున్నట్టు తెలుస్తుంది. 500 కోట్ల బడ్జెట్ లో వంద కోట్లు మెయిన్ ఆర్టిస్టుల రెమ్యునరేషన్స్ కే పోతున్నాయట. హీరో యశ్ దాదాపు 50 కోట్ల రెమ్యునరేషన్ తో పాటు ప్రాఫిట్స్ లో లాభాలు వచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నాడట.
Also Read : Nandini Reddy : ఈ దెబ్బతో బాలీవుడ్ కి షిఫ్ట్ అవుతున్న నందినిరెడ్డి.. సమంత భర్త సాయంతో..?
ఇక కియారా అద్వానీకి 15 కోట్లు ఇస్తున్నారట. నయనతారకు 12 కోట్లు, రుక్మిణి వసంత్ కి 3 కోట్లు, తారా సుతారియా, హ్యూమా ఖురేషిలకు రెండు కోట్ల చొప్పున ఇస్తున్నారట. దర్శకురాలు, సాంకేతిక నిపుణులతో కలిపి ఈ లెక్క వంద కోట్లు దాటిందట. ఇక మేకింగ్ కి కూడా భారీగానే ఖర్చుపెడుతున్నారు. పీరియాడిక్ సెటప్ లో సినిమా కావడంతో ఆర్ట్ డిపార్ట్మెంట్ కి కూడా బాగానే ఖర్చు అవుతుందట. మరి కెజిఎఫ్ సక్సెస్ తో ఈ టాక్సిక్ కి జనాలు వస్తారా? భారీ కలెక్షన్స్ వస్తాయా చూడాలి.
