Independence Day Celebrations Red Fort : ఎర్రకోటలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.. జాతీయ జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ.. ప్రసంగం.. Live
Independence Day Celebrations Red Fort : 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఉదయం ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట వేదికగా ఘనంగా నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.
Independence Day Celebrations Red Fort
Independence Day Celebrations Red Fort : 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం ఉదయం దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట వేదికగా ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఎర్రకోటపై 13వ సారి వరుసగా ప్రధాని మోదీ జాతీయ జెండాను ఎగుర వేశారు. ఇదిలాఉంటే.. తొలుత ప్రధాని నరేంద్ర మోదీకి రాజ్‌ఘాట్ వద్ద మహాత్ముడికి నివాళులర్పించారు. అనంతరం ఎర్రకోట వద్ద గౌరవవందనం స్వీకరించి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకల ప్రారంభ సమయంలో వాయుసేన పూలవర్షం కురిపించింది.
