Mansukh Mandaviya : భారత కరోనా వ్యాక్సిన్ సర్టిఫికెట్ కు 96 దేశాలు ఆమోదం

భారత్ జారీ చేసే కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ కి ఇప్పటివరకు 96 దేశాలు ఆమోదం తెలిపాయని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్​సుఖ్ మాండవీయ మంగళవారం తెలిపారు. కొవిన్ యాప్​లో

Mansukh Mandaviya  భారత్ జారీ చేసే కొవిడ్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ కి ఇప్పటివరకు 96 దేశాలు ఆమోదం తెలిపాయని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్​సుఖ్ మాండవీయ మంగళవారం తెలిపారు. కొవిన్ యాప్​లో ఈ దేశాల జాబితా అందుబాటులో ఉందని తెలిపారు. మరిన్ని దేశాల్లో మన వ్యాక్సిన్ సర్టిఫికెట్ గుర్తింపు కోసం భారత్ ప్రయత్నిస్తోందన్నారు.

భారత్ తయారు చేసిన వ్యాక్సిన్లకు  ప్రపంచవ్యాప్తంగా ఆమోదం లభిస్తోందన్న మాండవీయ.. ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) 8 వ్యాక్సిన్లకు అత్యవసర అనుమతులు జారీ చేయగా… అందులో రెండు(కొవిషీల్డ్, కొవాగ్జిన్) టీకాలు భారత్​కు చెందినవి ఉండటం గర్వకారణమన్నారు.

భారత వ్యాక్సిన్ లకు గుర్తింపునిచ్చిన దేశాలకు వెళ్తే ప్రయాణ ఆంక్షలకు మినహాయింపు ఉంటుందని మాండవీయ చెప్పారు. ఇక, దేశంలో ఇప్పటివరకు 109 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసినట్లు ఆరోగ్య మంత్రి తెలిపారు.

ALSO READ Malaysian Indian : కరోనా సోకడంతో చావు నుంచి తప్పించుకున్న భారత సంతతి వ్యక్తి

ట్రెండింగ్ వార్తలు