DK Shivakumar – Siddaramaiah : సిద్ధరామయ్య కాళ్లు మొక్కి కౌగిలించుకున్న డీకే శివకుమార్.. కానీ ఈ ట్విస్ట్ ఊహించలేదుగా.. !
DK Shivakumar Siddaramaiah : కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.
- Dharani Pilli
- Updated on- May 28, 2026 / 11:30 AM IST
Amid Karnataka Power Buzz Shivakumar Hugs Seeks siddaramaiah Blessings At Breakfast Meet
- కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం
- సిద్ధరామయ్యను కలిసిన డీకే శివకుమార్
- బెంగళూరులో లేని గవర్నర్
DK Shivakumar – Siddaramaiah: కర్ణాటక రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీఎం సిద్ధరామయ్య గురువారం తన పదవికి రాజీనామా చేయడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ అధిష్ఠానం.. కర్ణాటక పగ్గాలను డిప్యూటీ సీఎం డి.కె. శివకుమార్‌కు అప్పగించాలని నిర్ణయించడమే దీనికి ప్రధాన కారణం. గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో సిద్ధరామయ్య తన పదవికి రాజీనామా చేస్తారని సమాచారం. ఈ ప్రచారాలు కొనసాగుతున్న వేళ కర్ణాటక రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. సిద్ధరామయ్య రాజీనామాకు సిద్ధమవుతున్న వేళ.. కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ ఊహించని షాక్ ఇచ్చారు. అత్యంత కీలక సమయంలో ఆయన బెంగళూరులో లేకపోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
బెంగళూరులో లేని గవర్నర్..
కర్ణాటక గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ బుధవారం రాత్రి అత్యవసర వ్యక్తిగత పనిమీద తన సొంతూరు ముంబైకి వెళ్లారు. తిరిగి ఆయన ఎప్పుడు వస్తారనే దానిపై అధికారిక సమాచారం లేదు. అయితే గవర్నర్ బెంగళూరులో అందుబాటులో లేకపోయినా సిద్ధరామయ్య రాజీనామా ఆగదని అంటున్నారు. గవర్నర్ ఎక్కడి నుంచైనా ఆయన రాజీనామాను ఆమోదించేందుకు అవకాశం ఉన్నందున నేడు సిద్ధరామయ్య రాజీనామా చేయడం తప్పనిసరి అంటున్నారు.
వైరల్ అవుతున్న బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ ఫోటోలు..
అయితే రాజీనామా చేయడానికి ముందు సిద్ధరామయ్య తన నివాసంలో డి.కె. శివకుమార్‌తో పాటు తన కేబినెట్ సహచరులకు బ్రేక్‌ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ సమావేశానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. వాటిలో శివకుమార్ సిద్ధరామయ్యను ఆలింగనం చేసుకోవడం, ఆయన పాదాలను తాకి ఆశీర్వాదం తీసుకుంటున్న ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ అల్పాహార సమావేశం ప్రధాన ఉద్దేశం.. శివకుమార్‌కు మార్గం సుగమం చేస్తూ సిద్ధరామయ్య ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోబోతున్నారనే వార్తల మధ్య జరిగింది.
అయితే, నాయకత్వ మార్పుపై కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కర్ణాటకలో ఐదేళ్ల ప్రభుత్వ కాలపరిమితి సగానికి పైగా పూర్తి కావడంతో.. నాయకత్వ మార్పునకు సహకరించాలని సిద్ధరామయ్యను కాంగ్రెస్ అధిష్టానం కోరినట్లు సమాచారం.
అలాగే, ఈ సీనియర్ నాయకుడికి partyలో కేంద్ర స్థాయి పదవితో పాటు రాజ్యసభ సీటును కూడా ఆఫర్ చేసినట్లు సూత్రాలు చెబుతున్నాయి, అయితే సిద్ధరామయ్య ఈ ప్రతిపాదనను అంగీకరించలేదని తెలుస్తోంది. అధిష్టానంతో చర్చల అనంతరం సిద్ధరామయ్య గవర్నర్ థావర్ చంద్ గెహ్లాట్ అపాయింట్‌మెంట్ కోరినట్లు సమాచారం వచ్చింది. ఇదిలా ఉంటే కర్ణాటకలో కాంగ్రెస్ party అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అనగా మే 2023 నుంచి సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య నాయకత్వ పోరు అంతర్గతంగా సాగుతూనే ఉంది.
