Ram Mandir Donation: అయోధ్య రామమందిరానికి రూ.500 కోట్ల విరాళాలు.. కేంద్ర విచారణ కోరిన బీజేపీ నేత!
Ram Mandir Donation: అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి మందిరం దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది.
Ayodhya ram mandir receives over rs 500 crore donations from devotees
- 15 కోట్ల భక్తుల దర్శనం
- రూ.500 కోట్ల విరాళాల రికార్డు
- నిధులపై విచారణ డిమాండ్
Ayodhya Ram Mandir Donation: అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి మందిరం దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తుల ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది. ప్రాణ ప్రతిష్ఠ అనంతరం ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. అదే సమయంలో విరాళాల ప్రవాహం కూడా గణనీయంగా పెరిగింది. ఆలయ అభివృద్ధి, నిర్వహణ కార్యక్రమాలకు భక్తులు విశేషంగా సహకరిస్తున్నారని ట్రస్ట్ వర్గాలు వెల్లడించాయి.
శ్రీరామ(Ayodhya Ram Mandir) జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వెల్లడించిన వివరాల ప్రకారం, ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు 15 కోట్లకు పైగా భక్తులు ఆలయాన్ని సందర్శించారు. ఈ కాలంలో రూ.500 కోట్లకుపైగా విరాళాలు అందినట్లు ట్రస్ట్ తెలిపింది. ప్రస్తుతం రోజుకు సగటున రూ.8 నుంచి రూ.10 లక్షల వరకు విరాళాలు వస్తున్నాయని, నిధుల లెక్కింపుతో పాటు భద్రపరిచే బాధ్యతలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)కి అప్పగించినట్లు పేర్కొంది.
ఇదిలా ఉండగా, రామమందిర నిధుల వినియోగంపై రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. విరాళాల నిధుల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో నిష్పక్షపాత విచారణ జరపాలని భాజపా అధికార ప్రతినిధి డాక్టర్ రజ్నీశ్ సింగ్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. మరోవైపు సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ చేసిన ఆరోపణల నేపథ్యంలో రామాలయ నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్ర అయోధ్యలో ట్రస్ట్ సభ్యులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించినట్లు సమాచారం.
