వరవరరావుకు నో బెయిల్
- Subhan Ali Shaik
- Published On : April 29, 2019 / 11:36 AM IST
బీమా కోరేగావ్ కేసులో వరవరరావు బెయిల్ అభ్యర్థనను పుణె కోర్టు ఇవాళ(ఏప్రిల్-29,2019) తిరస్కరించింది.తన మరదలు మరణానంతర కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఏప్రిల్-29,2019 నుంచి మే-4,2019వరకు తాత్కాలిక బెయిల్ కోరుతూ వరవరరావు పుణె కోర్టును అభ్యర్థించారు.ఒకవేళ వరవరరావుకు బెయిల్ ఇస్తే ఆయన పారిపోయే అవకాశాలు ఉన్నట్లు ప్రాసిక్యూటర్ కోర్టు ముందు వాదించారు.వాదనలు విన్న కోర్టు వరవరరావు బెయిల్ అభ్యర్థనను తిరస్కరించింది. బీమా కోరేగావ్ కేసులో వరవరరావుతో పాటు ఢిల్లీ వర్సిటీ ప్రొఫెసర్ సాయిబాబా కూడా పుణె పోలీసుల అదుపులో ఉన్నారు.
