Satyendra Jain
Satyendar Jain: సత్యేందర్ జైన్‌పై కేసు పూర్తిగా ఫేక్ అని.. రాజకీయ దురుద్దేశంతో మోపిన ఆరోపణ అని ఢిల్లీ సీఎం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అంటున్నారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు పెట్టిన మనీ లాండరింగ్ కేసును స్వయంగా పరిశీలించానని ఆయన వివరించారు.
“జైన్‌పై కేసును పూర్తిగా స్టడీ చేశాను. అది పూర్తిగా ఫేక్, రాజకీయ కారణాలతో ప్రేరేపించబడిందే. న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంది. జైన్ సత్యాన్నే నమ్ముకున్నారు. అతను కచ్చితంగా బయటకు వస్తాడు,” అని కేజ్రీవాల్ మీడియా ముందు వివరించారు.
ఆప్ నిజాయతీగల రాజకీయ పార్టీ అని, ఈ కేసులో ఒక్క శాతమైన జైన్‌పై ఉక్కుపాదం మోపితే తానే స్వయంగా చర్యలు తీసుకునేవాడినని ఢిల్లీ సీఎం స్పష్టం చేశారు.
Read Also : మనీ లాండరింగ్ కేసులో మహారాష్ట్ర మంత్రిని విచారిస్తున్న ఈడి అధికారులు
“అవినీతికి పాల్పడం.. అవినీతిని సహించం. మాది నిజాయతీ గల ప్రభుత్వం. రాజకీయ కారణాల వల్ల అతణ్ని టార్గెట్ చేశారు. మాకు న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది.” అని కేజ్రీవాల్ వెల్లడించారు.
మనీలాండరింగ్ కేసులో జైన్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డిపార్ట్‌మెంట్ (ఈడీ) సోమవారం అరెస్టు చేసింది. కొన్ని గంటల విచారణ తర్వాత మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ)లోని క్రిమినల్ సెక్షన్ల కింద జైన్‌ను అదుపులోకి తీసుకున్నారు.