Viral Video: రైల్వే గేట్ దగ్గర లేట్ అవుతుందని.. ఈ సారు ఏం చేశాడో చూడండి.. ఆ బండి వెయిట్ ఎంతంటే..
వీడియోలో అతను చేతులతో బైక్ ఎత్తి, భుజాలపై వేసుకుని రోడ్డుకి అవతలికి వెళ్లడం కనిపిస్తోంది. ఎక్కడా ఆగకుండా, విశ్రాంతి లేకుండా దాటేశాడు.

viral video
Viral Video: రైల్వే క్రాసింగ్ వద్ద రైలు వెళ్లే వరకు ఆగే ఓపిక కూడా ఉండదు చాలా మందికి. సాధారణంగా రైలు వస్తున్న సమయంలో ఎవ్వరూ రైల్ ట్రాకులను దాటకూడదని గేట్లు మూసేస్తారు.
అయినప్పటికీ నడుచుకుంటూ వెళ్లేవారు చాలా మంది ట్రాకులను దాటేస్తుంటారు. వాహనాల్లో వెళ్లే వారు మాత్రం వెయిట్ చేసే ఓపిక లేకపోయినా వెయిట్ చేయాల్సిందే.
అయితే, ఓ వ్యక్తి మాత్రం ఓ రైల్వే క్రాసింగ్ వద్ద వెయిట్ చేయకుండా, తన బైక్ ని భుజాలపై ఎత్తి దాన్ని దాటాడు. ఆ బైక్ బరువు 112 కిలోలు. ఈ సీన్ ఇంటర్నెట్ లో వైరల్ (Viral Video) అవుతోంది.
బాహుబలి అంటున్నారు..
కొంతమంది నెటిజన్లు అతనిని “బాహుబలి” అని పిలుస్తుంటే, ఇంకొంతమంది అతడికి ఓపిక లేకపోవడాన్ని తప్పుపడుతున్నారు.
100 కిలోలకుపైగా బైక్ భుజాలపై మోసుకోవడం వల్ల వెన్నునొప్పి, ఆ తర్వాత ఆర్థరైటిస్ వచ్చే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
రైల్వే గేట్ వద్ద ఇరువైపులా వాహనదారులు వెయిట్ చేస్తుండగా, అతడు మాత్రం వెయిట్ చేయకుండా తన బైక్ ను భుజాలపై ఎత్తుకుని దాటుతుండగా అక్కడ ఉన్న వారు అందరూ అతడికి విచిత్రంగా చూశారు.
హీరో హోండా మోడల్ బైక్
వీడియోలో అతను చేతులతో బైక్ ఎత్తి, భుజాలపై వేసుకుని రోడ్డుకి అవతలికి వెళ్లడం కనిపిస్తోంది. ఎక్కడా ఆగకుండా, విశ్రాంతి లేకుండా దాటేశాడు.
సాధారణంగా మనుషులు తమ లగేజీ మోయడమే కష్టంగా ఉంటే, ఈ వ్యక్తి మాత్రం మొత్తం టూ-వీలర్ ను భుజాలపై మోశాడు.
సాధారణంగా బైక్స్, టూ వీలర్లు 150-200 కిలోల వరకూ వెయిట్ ఉంటాయి. కానీ అతను మోసిన బైక్ హీరో హోండా మోడల్ లాగా కనిపిస్తోంది.
దాని సగటు వెయిట్ 112 కిలోలు (ఫ్యూయెల్, ఇతర పార్ట్స్ తో కలిపి).
रेलवे क्रॉसिंग की ऐसी की तैसी…..!!!
हम जहाँ खड़े होते है….. लाइन वहीं से शुरू होती है…!! pic.twitter.com/ZoibSNgyqW
— kapil bishnoi (@Kapil_Jyani_) August 17, 2025