రెస్టారెంట్ బంపర్ ఆఫర్ : ఓటేసిరండి.. 20శాతం డిస్కౌంట్ పొందండి
ఎన్నికల వేళ ముంబైలోని ఓ రెస్టారెంబ్ యాజమాన్యం బంపర్ ఆఫర్ అనౌన్స్ చేసింది. ఏప్రిల్ 29న ముంబైలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఆ రోజున ఓటేసినవాళ్లకు తమ
- veegam team
- Published On : March 31, 2019 / 05:10 AM IST
ఎన్నికల వేళ ముంబైలోని ఓ రెస్టారెంబ్ యాజమాన్యం బంపర్ ఆఫర్ అనౌన్స్ చేసింది. ఏప్రిల్ 29న ముంబైలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఆ రోజున ఓటేసినవాళ్లకు తమ
ఎన్నికల వేళ ముంబైలోని ఓ రెస్టారెంబ్ యాజమాన్యం బంపర్ ఆఫర్ అనౌన్స్ చేసింది. ఏప్రిల్ 29న ముంబైలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఆ రోజున ఓటేసినవాళ్లకు తమ రెస్టారెంట్ లో 20శాతం డిస్కౌంట్ ఇస్తామని యాజమాన్యం ప్రకటించింది. ఓటేసిరండి.. 20శాతం డిస్కౌంట్ పొందండి అని స్లోగన్ వినిపిస్తోంది. తమ రెస్టారెండ్ లో అన్ని రకాల ఫుడ్ ఐటెమ్స్ కు ఆ ఆఫర్ వర్తిస్తుందని చెప్పారు. టాటూస్ నుక్ చైనీస్(tatus nook chinese), థాయ్ రెస్టారెంట్(thai restaurant) గోరెగావ్ వెస్ట్ లోని రెస్టారెంట్లలో ఈ ఆఫర్ ఇచ్చారు.
Read Also : మే 23 తర్వాత ఫ్యాన్ ఇంటికి, గ్లాస్ బార్‌కి : బాలయ్య సెటైర్
2014 లోక్ సభ ఎన్నికల సమయంలో ఇలాంటి ఆఫర్ ఇచ్చామని రెస్టారెంట్ ఓనర్ సంజయ్ తెలిపారు. అప్పుడు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని, ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలని సంజయ్ కోరారు. ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకోవాలనే తన లక్ష్యం అని, ఓటర్లలో చైతన్యం నింపేందుకే ఇలాంటి ఆఫర్లు ఇస్తున్నామని సంజయ్ తెలిపారు. ఓటింగ్ శాతం పెంచేందుకు తోడ్పాటు అందించడం ఆనందంగా ఉందన్నారు.
రెస్టారెంట్ ఓనర్ ఆలోచనా విధానం నెటిజన్లను ఆకట్టుకుంది. మీరు మంచి పని చేస్తున్నారు అని కితాబిచ్చారు. ఓటు శాతం పెంచేందుకు దోహదం చేయడం ప్రశంసనీయం అన్నారు. మహారాష్ట్రలో 4 దశల్లో లోక్ ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 29న పోలింగ్ జరగనుంది. మే 23న ఫలితాలు వెల్లడిస్తారు.
Read Also : చంద్రగిరిలో టెన్షన్ : తలలు పగలకొట్టుకున్న టీడీపీ-వైసీపీ కార్యకర్తలు
