Abhijeet Dipke: సీజేపీ అధినేత అభిజీత్ దిప్కే ఇంట తీవ్ర విషాదం
‘కాక్రోచ్ జనతా పార్టీ’ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే(Abhijeet Dipke) కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.
CJP founder Abhijeet Dipke grandmother Savitribai has passed away.
Abhijeet Dipke: ప్రస్తుతం ఢిల్లీ పోలీసుల కస్టడీలో ఉన్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే (Abhijeet Dipke)కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన నానమ్మ సావిత్రి బాయి (85) కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ శనివారం మహారాష్ట్రలోని హింగోలి జిల్లా, సంతుక్ పింప్రిలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఢిల్లీలో నిరసన తెలపడానికి వచ్చి పోలీసుల అదుపులో ఉన్న అభిజీత్‌కు ఈ బాధాకరమైన వార్తను ఢిల్లీ పోలీసు వర్గాలే స్వయంగా తెలియజేశాయి.
అంత్యక్రియలకు వెళ్తారా? నిర్ణయం అభిజీత్ చేతుల్లోనే:
ఆదివారం ఉదయం 10 గంటలకు సంతుక్ పింప్రిలో సావిత్రిబాయి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. కస్టడీలో ఉంటూనే తన నిరసన పోరాటాన్ని కొనసాగించాలా లేక నానమ్మ కడసారి చూపు కోసం సొంతూరుకు వెళ్లాలా అనే నిర్ణయాన్ని అభిజీత్ దిప్కేకే వదిలేసినట్లు ఢిల్లీ పోలీసు వర్గాలు వెల్లడించాయి. గత 20-25 రోజులుగా నానమ్మను కలవలేకపోయిన అభిజీత్, ఈ విషాద సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.
