Maharashtra: ఏక్‌నాథ్ షిండే, ప్రకాష్ అంబేద్కర్ భేటీ.. ఉద్ధవ్ థాకరేకు టాటా చెప్పినట్టేనా?
వాస్తవానికి ఈ విషయమై గతేడాది డిసెంబర్‌లోనే ముఖ్యమంత్రి షిండేను ప్రకాశ్ అంబేద్కర్ కలిశారు. ఆ సమయంలో కూడా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్మారక ప్రాజెక్టుపై చర్చించారు. ఇక ఈ విషయం పక్కన పెడితే.. ఉద్ధవ్ థాకరే నాయకత్వంలోని శివసేనతో వీబీఏ పొత్తు ఇప్పటికే ఫైనల్ వరకు వచ్చిందని, దీంతో ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనతో చేతులు కలిపే ప్రశ్నే లేదని ప్రకాశ్ అంబేద్కర్ వర్గీయుల సమాచారం.
- tony bekkal
- Published On : January 12, 2023 / 04:06 PM IST
CM Shinde and VBA’s Prakash Ambedkar hold closed-door meet
Maharashtra: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, వంచిత్ బహుజన్ అఘాడీ అధినేత ప్రకాశ్ అంబేద్కర్ బుధవారం అర్థరాత్రి ఏకాంతంగా సమావేశమయ్యారు. దీంతో శివసేన (షిండే వర్గం), వంచిత్ బహుజన్ అఘాడీ పార్టీల మధ్య పొత్తు ఏర్పడబోతుందనే ఊహాగాణాలు చెలరేగాయి. అయితే ఈ ఊహాగాణాలను వీబీఏ కొట్టిపారేసింది. ఇరు నేతల మధ్య సమావేశం రాజకీయేతరమని ప్రకటించింది. ముఖ్యమంత్రి పిలుపు మేరకు ఇరువురు నేతల మధ్య సమావేశం జరిగినట్లు తెలుస్తోంది.
BRS Politics In Bhadradri District : భద్రాద్రి జిల్లా బీఆర్ఎస్‌లో విభేదాలు.. వనమా Vs రేగా
“మూతపడిన ఇందూ మిల్లు ప్రాంగణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్మారక నిర్మాణం జరుగుతోంది. దీనికి సంబంధించే ఇరు నేతలు సమావేశం అయ్యారు. స్మారక పనులను వేగవంతం చేయాలని బాలాసాహెబ్ (ప్రకాష్ అంబేద్కర్) ప్రయత్నిస్తున్నారు. అదే స్థలంలో ప్రపంచ స్థాయి పరిశోధనా కేంద్రాన్ని కూడా నిర్మించాలని సీఎంకు సూచించారు. ఈ నేపథ్యంలో ఇద్దరు నాయకులకు సమావేశమయ్యారు.” అని వీబీఏ ప్రతినిధి సిద్ధార్థ్ మోక్లే తెలిపారు.
వాస్తవానికి ఈ విషయమై గతేడాది డిసెంబర్‌లోనే ముఖ్యమంత్రి షిండేను ప్రకాశ్ అంబేద్కర్ కలిశారు. ఆ సమయంలో కూడా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ స్మారక ప్రాజెక్టుపై చర్చించారు. ఇక ఈ విషయం పక్కన పెడితే.. ఉద్ధవ్ థాకరే నాయకత్వంలోని శివసేనతో వీబీఏ పొత్తు ఇప్పటికే ఫైనల్ వరకు వచ్చిందని, దీంతో ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనతో చేతులు కలిపే ప్రశ్నే లేదని ప్రకాశ్ అంబేద్కర్ వర్గీయుల సమాచారం.
Mallu Ravi: సునీల్ కనుగోలు కేసు.. విచారణకు మల్లు రవి
“వీబీఏ ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీతో చేతులు కలపదని బాలాసాహెబ్ (ప్రకాష్ అంబేద్కర్) విలేకరుల సమావేశంలో స్పష్టం చేశారు. బీజేపీతోనే కాదు, ఆ పార్టీతో పొత్తులో ఉన్న ఏ పార్టీతోనూ వీబీఏ చేతులు కలపదు. అందువల్ల, షిండే వర్గంతో పొత్తు గురించి చర్చ నిర్వహించే ప్రశ్న అవసరం లేదు.” అని మోక్లే అన్నారు. గత నెలలో, ఉద్ధవ్ థాకరే, ప్రకాశ్ అంబేద్కర్ సమావేశమై ముంబై పౌర సంస్థల ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. వీబీఏతో తమ చర్చల గురించి తమ మహా వికాస్ అఘాడీ కూటమి భాగస్వాములైన కాంగ్రెస్, ఎన్సీపీలతో ఇంకా చర్చించనట్లు తెలుస్తోంది.