CM Vijay Astrologer: నిన్న అపాయింట్ మెంట్, ఇవాళ ఊస్టింగ్.. జ్యోతిష్యుడికి బిగ్ షాక్ ఇచ్చిన విజయ్
CM Vijay Astrologer : టీవీకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ జ్యోతిష్యుడు రాధన్ పండిట్ వెట్రివెల్ను ముఖ్యమంత్రి ప్రత్యేక అధికారిగా (ఓఎస్డీ) నియమించుకున్న విషయం తెలిసిందే. ఆయన నియామకంపై విమర్శలు రావడంతో ప్రస్తుతం ఆయన నియామకాన్ని రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
CM Vijay key decision Astrologer Rickey Radhan Pandit Vettrivel removed as the Officer on Special Duty
Tamil Nadu CM Vijay Astrologer: టీవీకే అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ జ్యోతిష్యుడు రాధన్ పండిట్ వెట్రివెల్ను ముఖ్యమంత్రి ప్రత్యేక అధికారిగా (ఓఎస్డీ) నియమించుకున్న విషయం తెలిసిందే. అయితే, రాధన్ నియామకంపై ప్రతిపక్ష పార్టీల నుంచేకాక ప్రభుత్వానికి మద్దతు ఇచ్చిన పార్టీల నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. బలపరీక్ష సమయంలో పలువురు ఎమ్మెల్యేలు రాధన్ నియామయంపై పునరాలోచించాలని సూచించారు. దీంతో విజయ్ సైతం స్పందిస్తూ.. రాధన్ నియామకాన్ని పునరాలోచిస్తానని చెప్పారు. బల పరీక్షలో టీవీకే ప్రభుత్వం నెగ్గిన కొద్దిసేపటికే రాధన్ పండిట్ వెట్రివెల్ నియామకాన్ని రద్దు చేస్తున్నట్లు విజయ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ముఖ్యమంత్రి విజయ్ తన కార్యాలయంలో జ్యోతిష్యుడు రాధన్ పండిట్ వెట్రివేల్ ను ఓఎస్డీగా నియమించడంపై వీసీకే, డీఎండీకే, బీజేపీ, డీఎంకే వంటి పార్టీలు విజయ్ను ప్రశ్నించాయి. డీఎండీకే పార్టీ ఏకైక ఎమ్మెల్యే, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రేమలతా విజయ్ కాంత్ (విజయ్ కాంత్ సతీమణి) రాధన్ పండిట్ వెట్రివెల్ ను ఓఎస్డీగా నియమించడంపై తీవ్ర అభ్యంరాలు వ్యక్తం చేశారు.
ఒక జ్యోతిష్యుడిని ఓఎస్డీగా నియమించుకోవడం ద్వారా యువతకు ఏం సందేశం ఇస్తున్నారని ప్రశ్నించారు. సీఎంను కలవడానికి వేరే ముఖం వేసుకుని రావొద్దు అంటూ చురకలు అంటించారు. లెఫ్ట్ పార్టీల నుంచి కూడా రాధన్ నియామకంపై అభ్యంతరాలు రావడంతో విజయ్ వెనక్కి తగ్గారు. దీంతో ఓఎస్డీగా రాధన్ నియామకాన్ని రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
