Delhi High Alert : ఢిల్లీలో హై అలర్ట్.. జంతర్ మంతర్ నిరసనతో భారీ భద్రత.. మెట్రో స్టేషన్లు బంద్!
Delhi High Alert : జంతర్ మంతర్ వద్ద సీజేపీ నిరసన నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. పలు మెట్రో స్టేషన్ల మూతపడ్డాయి. సరిహద్దుల్లో తనిఖీలు, డ్రోన్లతో నిఘా మధ్య భద్రతను కట్టుదిట్టం చేశారు.
Delhi High Alert
- ఢిల్లీ వీధుల్లో పోలీసుల పహారా.. డ్రోన్లతో నిఘా, సరిహద్దుల్లో చెకింగ్
- ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా నిరసన.. ఢిల్లీలో హై అలర్ట్ ఎందుకంటే?
- నిరసన సెగతో ఢిల్లీ ఉక్కిరిబిక్కిరి.. మెట్రో స్టేషన్ల మూసివేత
Delhi High Alert : దేశ రాజధాని ఢిల్లీలో నిరసన సెగ మొదలైంది. జంతర్ మంతర్ వద్ద సీజేపీ చేపట్టనున్న ఆందోళన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నగరవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. సరిహద్దుల వద్ద వాహనాల తనిఖీలు, కీలక ప్రాంతాల్లో డ్రోన్ల నిఘా, భారీగా పోలీసుల మోహరింపుతో ఢిల్లీలో హై అలర్ట్ వాతావరణం నెలకొంది.
మెట్రో స్టేషన్ల మూసివేత.. కీలక ప్రాంతాల్లో నిఘా :
భద్రతా చర్యల్లో భాగంగా సుప్రీంకోర్టు, మండి హౌస్ సహా పలు మెట్రో స్టేషన్లను మూసివేశారు. జనపథ్ గోల్ చక్కర్, ఫిరోజ్ షా రోడ్డు పరిసరాల్లో బారికేడ్లు ఏర్పాటు చేశారు. న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్ వద్ద ఢిల్లీ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) సిబ్బందిని మోహరించి డ్రోన్లతో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
Read Also : Panama Earthquake : పనామాలో భూకంప బీభత్సం.. 7.7 తీవ్రతతో ప్రకంపనలు, భయంతో పరుగులు తీసిన ప్రజలు
సరిహద్దుల్లో చెకింగ్.. బాడీ కెమెరాలతో రికార్డింగ్ :
ఢిల్లీకి వచ్చే వాహనాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అయా నగర్, ఘాజీపూర్, బదర్పూర్, ఢిల్లీ-ఘాజియాబాద్ సరిహద్దుల్లో భద్రతను పెంచారు. పోలీసు సిబ్బందికి బాడీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అనుమానాస్పద కదలికలను గుర్తించేందుకు సీసీటీవీ కెమెరాల ద్వారా నిఘా కొనసాగిస్తున్నారు.
కీలక నేతల నివాసాల వద్ద అదనపు భద్రత :
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నివాసాల వద్ద భద్రతను మరింత పెంచారు. అదనపు భద్రతా బలగాలను మోహరించారు. మరోవైపు, గౌతమ్ బుద్ధ నగర్ జిల్లాలో BNSS సెక్షన్ 163 కింద ఆంక్షలు విధించారు.
అనుమతి లేకుండా ఐదుగురు లేదా ఎక్కువ మంది గుమిగూడడం, ఊరేగింపులు నిర్వహించడం వంటి చర్యలపై నిషేధం విధించారు. నిరసన నేపథ్యంలో ఢిల్లీలోని కీలక ప్రాంతాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
