Digvijaya Remark: దిగ్విజయ్ ‘సర్జికల్ స్ట్రైక్స్’ వ్యాఖ్యలతో కాంగ్రెస్‭కు సంబంధం లేదట

2016లో జమ్మూ కశ్మీర్‭లోని ఉరిలోని 12 బ్రిగేడ్ కేంద్ర కార్యాలయంపై జరిగిన ఉగ్రదాడిలో 18 మంది జవాన్లు మరణించారు. అనంతరం, 10 రోజులకు పాకిస్తాన్ ప్రాంతంపై భారత సేనలు సర్జికల్ దాడులు చేశారు. ఇకపోతే, జమ్మూ కశ్మీర్‭లో ఉగ్రవాదం తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు అన్నీ వృధా అయ్యాయని దిగ్విజయ్ విమర్శించారు

Congress distances itself from Digvijaya Singh's surgical strikes remark

Digvijaya Remark: సర్జికల్ దాడుల విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి రిపోర్ట్ పార్లమెంటు ముందు ఎందుకు సమర్పించలేదంటూ కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలతో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని ఆ పార్టీ మరో సీనియర్ నేత జైరాం రమేశ్ అన్నారు. ఆయన వ్యాఖ్యలతో పార్టీ ఏకీభించడం లేదని, ఆ వ్యాఖ్యలకు పార్టీ దూరంగా ఉంటున్నట్లు సోమవారం ఆయన స్పష్టం చేశారు. ఈ విషయమై ఆయన తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందిస్తూ ‘‘సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఆయన వ్యక్తిగతం. వాటితో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. 2014కు ముందు యూపీఏ ప్రభుత్వం సర్జికల్‌ స్ట్రైక్స్‌ చేసింది. జాతీయ ప్రయోజనాలకు సంబంధించిన అన్ని సైనిక చర్యలకు కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. ఆ మద్దతు కొనసాగిస్తుంది’’ అని ట్వీట్ చేశారు.

Maharashtra: గవర్నర్ పదవి నుంచి దిగిపోతానంటున్న భగత్‭సింగ్ కోశ్యారి.. మోదీకి సందేశం

దీనికి ముందు, దిగ్విజయ్ సింగ్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ ‘‘పుల్వామా దాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. జవాన్లను హెలికాఫ్టర్ ద్వారా చేరవేయాలని సీఆర్‭పీఎఫ్ ముందుగానే ప్రధానమంత్రి నరేంద్రమోదీకి విజ్ణప్తి చేసింది. కానీ మోదీ ఇందుకు అంగీకరించలేదు. ఆ తర్వాత ఎలాంటి దారుణం జరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇంత దారుణం జరిగిన ఏళ్లు గడుస్తున్నా దీనిపై ప్రభుత్వం ఒక్క రిపోర్టు కూడా పార్లమెంట్ ముందు సమర్పించలేకపోయింది. సర్జికల్ స్ట్రైక్స్ చేశామని ప్రభుత్వం చెప్పింది. కానీ దానికి ఆధారాలు కనిపించడం లేదు. అబద్ధాలు చెబుతూ ప్రజల్ని మోసగించారు’’ అని అన్నారు.

Ramcharitmanas: రామచరితమానస్ మీద మండిపడ్డ మరో నేత.. SC, ST, OBC లను తిట్టారంటూ సంచలన కామెంట్స్

2016లో జమ్మూ కశ్మీర్‭లోని ఉరిలోని 12 బ్రిగేడ్ కేంద్ర కార్యాలయంపై జరిగిన ఉగ్రదాడిలో 18 మంది జవాన్లు మరణించారు. అనంతరం, 10 రోజులకు పాకిస్తాన్ ప్రాంతంపై భారత సేనలు సర్జికల్ దాడులు చేశారు. ఇకపోతే, జమ్మూ కశ్మీర్‭లో ఉగ్రవాదం తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు అన్నీ వృధా అయ్యాయని దిగ్విజయ్ విమర్శించారు. ఆర్టికల్-370 రద్దు, నోట్ల రద్దు, కేంద్ర పాలిత ప్రాంతం చేయడం.. ఇవన్నీ ఉగ్రవాదాన్ని అదుపులోకి తీసుకురాలేకపోయాయని ఆయన విమర్శించారు.