ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు దివంగత లాలా లజపత్ రాయ్ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. లాలా లజపత్ రాయ్ దేశానికి చేసిన సేవలు ప్రజలందరికీ స్ఫూర్తిదాయకమని అన్నారు.భరతమాత సాహస పుత్రుడు, పంజాబ్ కేసరి లాలా లజపత్ రాయ్ జయంతి సందర్భంగా ఆయనకు సెల్యూట్. దేశ స్వాతంత్ర్య కోసం ఆయన చేసిన త్యాగాలు ఎప్పటికీ దేశ ప్రజలకు స్ఫూర్తిగా నిలుస్తాయని ఓ ట్వీట్‌లో మోడీ గుర్తుచేసుకున్నారు.
मां भारती के वीर सपूत पंजाब केसरी लाला लाजपत राय को उनकी जयंती पर शत-शत नमन। देश की आजादी के लिए प्राण न्योछावर करने की उनकी गाथा देशवासियों को सदैव प्रेरित करती रहेगी।
— Narendra Modi (@narendramodi) January 28, 2020
అలాగే కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సైతం మరో ట్వీట్‌లో లాలా లజపత్ రాయ్‌కు సంతాపం తెలిపారు. ‘నిజమైన జాతీయవాది, గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడైన లాలా లజపత్ రాయ్‌కి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని తెలిపారు. అందరికీ మార్గదర్శకుడు. లజపత్ రాయి దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయం’ అని రాజ్‌నాథ్ గుర్తుచేసుకున్నారు. పంజాబ్ కేసరిగా ప్రసిద్ధుడైన లాలా లజపత్ రాయ్ భారత స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించారని అన్నారు.
I bow to great freedom fighter and a true nationalist, Lala Lajpat Rai on his jayanti. The nation pays heartfelt tributes to Lalaji, an exceptional leader and mentor, for his immense contribution to India’s freedom struggle.
— Rajnath Singh (@rajnathsingh) January 28, 2020