తీరం దాటిన తర్వాత బుల్ బుల్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రచండ వేగంతో గాలులు వీస్తున్నాయి. పశ్చిమబెంగాల్‌లోని సాగర్ ద్వీపం దగ్గర బుల్
భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రచండ వేగంతో గాలులు వీస్తున్నాయి. తీరం దాటిన తర్వాత కూడా బుల్ బుల్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. పశ్చిమ బెంగాల్, ఒడిశా తీరాలను వణికిస్తోంది బుల్ బుల్. పశ్చిమ బెంగాల్‌లోని సాగర్ ద్వీపం దగ్గర బుల్ బుల్ తుఫాన్ తీరం దాటింది. తుఫాన్ ప్రభావంతో బెంగాల్‌లో గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. హుగ్లీ, హౌరా, దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో కుండపోత వానలు పడుతున్నాయి.
ఒడిశా, వెస్ట్ బెంగాల్ రాష్ట్రాల్లో భారీ వర్షాలతో ఏడుగురు మృతి చెందారు. జనజీవనం స్థంభించింది. పెద్ద సంఖ్యలో చెట్లు నేలకొరుగుతున్నాయి. ఉత్తర 24 పరగణాల జిల్లా కకావికలమైంది. కోల్కతాలో గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. అనేక చెట్లు కూలిపోయాయి. హోర్డింగులు ధ్వంసమయ్యాయి. విద్యుత్ సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.
ఎన్డీఆర్‌ఎఫ్ బలగాలు రంగంలోకి దిగాయి. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సహాయ, పునరావాస చర్యలు చేపట్టాయి. లోతట్టు తీర ప్రాంతాల నుంచి లక్షా 20వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ హౌరాలోని కంట్రోల్ రూమ్ నుంచి తుఫాన్ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ప్రధాన మోడీ సైతం బుల్ బుల్ తుఫాన్ ప్రభావంపై ఆరా తీశారు. ప్రభావిత రాష్ట్రాలను అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
కాగా.. తుఫాన్ ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరంలో వానలు పడే అవకాశం ఉందని.. సహాయక చర్యల కోసం నౌకలు, హెలికాఫ్టర్లను సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. తుఫాను ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
Odisha: Villagers at a temporary shelter home set up in Balasore district after their huts were damaged. #CycloneBulbul pic.twitter.com/c8MbjV4fUj
— ANI (@ANI) November 10, 2019