Dhanush Political Entry: రాజకీయాల్లోకి మరో స్టార్ హీరో? అధికారిక జెండా ఆవిష్కరణ
తమిళ స్టార్ ధనుష్(Dhanush Political Entry) పొలిటికల్ ఎంట్రీకి సిద్ధం అయినట్టుగా సమాచారం.
Hero Dhanush set to enter politics fans club launches official flag
- హీరో ధనుష్ రాజకీయ ప్రచారం.
- అభిమాన సంఘం జెండా ఆవిష్కరణ.
- రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు.
Dhanush Political Entry: కోలీవుడ్ చిత్ర పరిశ్రమలో విలక్షణ నటనతో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ధనుష్, ఇప్పుడు రాజకీయాల వైపు అడుగులు వేస్తున్నారనే ప్రచారం తమిళనాడులో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన అభిమాన సంఘం నిన్న నిర్వహించిన ఒక ప్రత్యేక ఈవెంట్లో అధికారిక జెండాను ఆవిష్కరించడం ఈ ఊహాగానాలకు మరింత బలమిచ్చింది. అంతేకాకుండా, రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేపట్టాలని ఫ్యాన్ క్లబ్ పిలుపునివ్వడంతో ధనుష్ పొలిటికల్ ఎంట్రీ దాదాపు ఖాయమనే సంకేతాలు వెలువడుతున్నాయి.
IAS Transfers: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీ
ఇటీవలే రాజకీయాల్లోకి(Dhanush Political Entry) వచ్చి సీఎం పీఠాన్ని అధిరోహించిన స్టార్ హీరో విజయ్ పంథాలోనే ధనుష్ కూడా ప్రయాణిస్తున్నారనే చర్చ నడుస్తోంది. వచ్చే ఎన్నికలను టార్గెట్ చేసుకునే ధనుష్ తన అభిమాన సంఘాల ద్వారా క్షేత్రస్థాయిలో బలాన్ని పెంచుకునేందుకు ఈ ప్లాన్ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. అయితే, రాజకీయ ప్రవేశం మరియు ఈ జెండా ఆవిష్కరణపై హీరో ధనుష్ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోవడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
