Peace Dog Aloka: 3,700కి.మీ.లు పీస్ వాక్.. అమెరికానే షేక్ చేసిన మన ‘అలోకా’.. ఢిల్లీలో ఘనస్వాగతం
ఒక సాధారణ భారతీయ వీధి కుక్క(Peace Dog Aloka) అంతర్జాతీయంగా శాంతిదూతగా మారి అద్భుతం సృష్టించింది.
indian street dog aloka completes 3700 km pace walk in usa
- భారతీయ శునకం అలోకా అద్భుత సంచలనం
- అమెరికాలో శాంతి పాదయాత్ర పూర్తి చేసింది
- కాలు సర్జరీ అయినా పట్టుదలతో నడిచింది
Peace Dog Aloka: సాధారణంగా పెంపుడు జంతువులు మన ఇళ్లకే పరిమితమవుతాయి. కానీ, ఒక సాధారణ భారతీయ వీధి కుక్క అంతర్జాతీయంగా శాంతిదూతగా మారి అద్భుతం సృష్టించింది. కోల్‌కతా విమానాశ్రయం సమీపంలో తిరుగుతూ, బౌద్ధ సన్యాసుల ప్రేమను పొంది ‘అలోకా(Peace Dog Aloka)’గా మారిన ఈ దేశవాళీ జాతి శునకం, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ‘పీస్ డాగ్’గా గుర్తింపు తెచ్చుకుంది. తన విలక్షణమైన నడకతో, సహనంతో కోట్ల మంది హృదయాలను గెలుచుకుంది.
Andhra Pradesh: ఏపీలో రేషన్ కార్డు ఉన్నవారికి గుడ్ న్యూస్.. ఇక నుంచి తక్కువ ధరకే
ఈ క్రమంలోనే అమెరికాలోని టెక్సాస్ నుండి వాషింగ్టన్ డి.సి. వరకు బౌద్ధ సన్యాసులతో కలిసి అలోకా చారిత్రాత్మక ‘శాంతి పాదయాత్ర’ చేపట్టింది. సుమారు 10 రాష్ట్రాల గుండా, తీవ్రమైన మంచు తుఫానులను తట్టుకుంటూ 108 రోజుల పాటు సాగిన ఈ యాత్రలో అలోకా దాదాపు 3,700 కిలోమీటర్లు నడిచింది. యాత్ర మధ్యలో కాలుకు సర్జరీ అయినా, పట్టుదల వీడకుండా కోలుకుని మళ్లీ సన్యాసులతో అడుగులు వేసి తన పీస్ వాక్‌ను విజయవంతంగా పూర్తి చేసింది.
అంతకుముందు భారతదేశంలో కూడా దాదాపు 100 రోజులకు పైగా సన్యాసులతో కలిసి నడిచిన అనుభవం దీనికి ఉంది. నుదుటిపై సహజసిద్ధమైన గుండె ఆకారపు మచ్చతో ప్రత్యేకంగా కనిపించే ఈ గ్లోబల్ అంబాసిడర్ డాగ్, తాజాగా ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. స్వదేశానికి తిరిగొచ్చిన అలోకాకు ఐజీఎన్సీఏ ఆధ్వర్యంలో ఘనస్వాగతం లభించింది. భారతదేశం, నేపాల్‌లలో త్వరలో ప్రారంభం కానున్న మరో శాంతి యాత్రలో పాల్గొనేందుకు అలోకా సిద్ధమవుతోంది.
