India First Bullet Train : వావ్.. భారత్ ఫస్ట్ బుల్లెట్ ట్రైన్ విజువల్స్ చూస్తే మతిపోవాల్సిందే.. ఢిల్లీ టు వారణాసి జస్ట్ 3.5 గంటల్లోనే..!
India First Bullet Train : భారత్ తొలి బుల్లెట్ రైలుపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక అప్డేట్ ఇచ్చారు. 2027 మే లేదా జూన్‌లో ట్రయల్స్, ముంబై-వడోదర మధ్య 90 నిమిషాల ప్రయాణం సహా పూర్తి వివరాలేంటో ఓసారి చూద్దాం..
India First Bullet Train
- బుల్లెట్ రైలు వచ్చేస్తోంది.. గంటన్నరలోనే ముంబైకి
- పట్టాలెక్కేందుకు రెడీ అయిన భారత్ తొలి బుల్లెట్ రైలు..
- వచ్చే ఏడాది పట్టాలపైకి తొలి బుల్లెట్ రైలు
India First Bullet Train : భారతీయ రైల్వే చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలుకాబోతోంది. ఇప్పటివరకు విదేశాల్లో మాత్రమే చూసిన బుల్లెట్ రైలు ప్రయాణం త్వరలో మన దేశంలోనూ అందుబాటులోకి రానుంది.
దేశపు మొట్టమొదటి బుల్లెట్ రైలుకు సంబంధించి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తాజాగా కీలక అప్డేట్ ఇచ్చారు. అంతేకాదు, భారత్‌లో తయారవుతున్న తొలి బుల్లెట్ రైలు దృశ్యాలను తన ఎక్స్ (X) ఖాతాలో షేర్ చేశారు. ‘మీరు రెడీగా ఉన్నారా? భారత్ తొలి బుల్లెట్ రైలు తయారీ’ అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్ కూడా జతచేశారు.
🚅 Are you ready?
Making of Bharat’s first Bullet Train!#Bharat_BulletTrain https://t.co/c4X0jEvusM
— Ashwini Vaishnaw (@AshwiniVaishnaw) November 1, 2026
వచ్చే ఏడాది పట్టాలపైకి.. :
ప్రధాని నరేంద్ర మోదీ ఆత్మనిర్భర్ భారత్ కలలో భాగంగా దేశీయంగా తయారవుతున్న ఈ బుల్లెట్ రైలు ఫస్ట్ బాడీ ఫ్రేమ్ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం స్క్వీజ్ టెస్ట్ కోసం పంపించారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. 2027 మే లేదా జూన్ నాటికి రైలు ట్రయల్స్ కోసం పట్టాలపైకి రానుంది. 2 నుంచి 4 నెలల పాటు ట్రయల్స్ నిర్వహించిన తర్వాత ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ రైలును ప్రారంభించనున్నట్లు అశ్విని వైష్ణవ్ వెల్లడించారు.
ముంబై టు వడోదర.. గంటన్నరే :
బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే ప్రయాణికులకు భారీ ఊరట లభించనుంది. వడోదర నుంచి ముంబైకి కేవలం 90 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ఇక సూరత్-బిలిమోరా మధ్య తొలి విభాగాన్ని కూడా వచ్చే ఏడాది ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
యూపీకి మరో బంపర్ ఆఫర్ :
మరోవైపు ఢిల్లీ-వారణాసి నార్తర్న్ బుల్లెట్ రైలు కారిడార్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మార్గం అందుబాటులోకి వస్తే.. ఢిల్లీ-వారణాసి ప్రయాణం 3 గంటల 33 నిమిషాలకు తగ్గనుంది. ఢిల్లీ-ఆగ్రా 59 నిమిషాలు, ఢిల్లీ-కాన్పూర్ 1 గంట 45 నిమిషాలు, ఢిల్లీ-లక్నో 2 గంటల 12 నిమిషాలు, వారణాసి-ప్రయాగ్‌రాజ్ కేవలం 33 నిమిషాలే పట్టనున్నాయి. మొత్తానికి బుల్లెట్ రైలు రాకతో దేశంలో ప్రయాణ వేగం, రవాణా రంగం రూపురేఖలే మారిపోనున్నాయి..
