Karnataka: మద్యం కొనుగోలు వయసును మూడేళ్లు తగ్గించనున్న ప్రభుత్వం.. 18 ఏళ్లు ఉంటే చాలట

వయసు విషయంలో అధికారులు గందరగోళానికి గురయ్యే పరిస్థితి పలు సందర్భాలలో తలెత్తిందట. బార్లకు వెళ్లే 21 ఏళ్ల లోపు వయసు ఉన్న యువత ఎలాంటి గుర్తింపు కార్డులు లేవంటూ మాట దాటవేస్తున్నారు. అయితే ఇప్పటికే యువత ఇష్టానుసారంగా మత్తులో తూలుతూ అనారోగ్యానికి, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న సందర్భాలు బయటపడుతున్న సందర్భాలు అనేకం

Karnataka: 21 ఏళ్ల వయసు నిండిన వారికి మాత్రమే మద్యం విక్రయించాలనే నిబంధనను సవరించడానికి కర్ణాటక ప్రభుత్వం సిద్ధమైంది. ఈ వయసును మూడేళ్లు తగ్గించి 18 ఏళ్ల వయసుకే విక్రయించే విధంగా చట్ట సవరణ చేస్తోంది. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్‭ను రెండు రోజుల క్రితమే విడుదల చేశారు. అయితే ఈ నిర్ణయంపై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించేందుకు ప్రభుత్వం కొంత గడువు తీసుకుంది.

Shankar Mishra: విమానంలో మహిళపై మూత్ర విసర్జన చేసిన కేసులో కొత్త కోణం

రాష్ట్ర అబ్కారీశాఖ 2023 చట్టసవరణ ద్వారా వయస్సును మూడేళ్ల పరిమితిని తగ్గించాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంపై నెలరోజులపాటు ప్రజల నుంచి అభ్యంతరాలు స్వీకరించే అవకాశం ఉంది. అయితే దీనిపై ప్రభుత్వం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. గతంలో ఇది 18 ఏళ్ల వయసుకే పరిమితమై ఉంది. ఇది 2015 ఏడాది వరకు ఉంది. 2015లో 1967 నిబంధన ప్రకారం 18 ఏళ్ల వయసు నుంచి 21 ఏళ్లకు పెంచుతూ తీర్మానం చేశారు. అంతలోపు వయసున్నవారికి మద్యం విక్రయాలతోపాటు పబ్‌, బార్లలో అనుమతి నిరాకరించారు.

Car-Dragging Death: ఢిల్లీలో మహిళను ఈడ్చుకెళ్లిన కారు ప్రమాదంపై హోంశాఖ చర్యలు.. 11 మంది పోలీసులు సస్పెండ్

వయసు విషయంలో అధికారులు గందరగోళానికి గురయ్యే పరిస్థితి పలు సందర్భాలలో తలెత్తిందట. బార్లకు వెళ్లే 21 ఏళ్ల లోపు వయసు ఉన్న యువత ఎలాంటి గుర్తింపు కార్డులు లేవంటూ మాట దాటవేస్తున్నారు. అయితే ఇప్పటికే యువత ఇష్టానుసారంగా మత్తులో తూలుతూ అనారోగ్యానికి, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న సందర్భాలు బయటపడుతున్న సందర్భాలు అనేకం. ప్రభుత్వం తీసుకున్న వయసు తగ్గించే నిర్ణయంపై ప్రజలలో వ్యతిరేకత వ్యక్తం కావచ్చుననే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు