Lalit Modi: సుశ్మితా సేన్‌ను భార్యగా ప్రకటించిన లలిత్ మోదీ
"మాల్దీవులు, సర్దీనియాల టూర్ ను కుటుంబంతో కలిసి పూర్తి చేసుకుని తిరిగి లండన్ చేరుకున్నారు. సుస్మితా సేన్ నా కొత్త పార్టనర్.. ఇదో కొత్త ఆరంభం, కొత్త జీవితం మొదలుకానుంది" అని లలిత్ మోదీ ట్వీట్ చేశారు.
- Subhan Ali Shaik
- Updated on- July 14, 2022 / 09:08 PM IST
Lalit Modi
Lalit Modi: ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ.. సుశ్మితా సేన్‌తో కలిసి ఇది కొత్త ఆరంభం అంటూ అభిమానులతో ఈ విషయాన్ని పంచుకున్నారు. “మాల్దీవులు, సర్దీనియాల టూర్ ను కుటుంబంతో కలిసి పూర్తి చేసుకుని తిరిగి లండన్ చేరుకున్నారు. సుస్మితా సేన్ నా కొత్త పార్టనర్.. ఇదో కొత్త ఆరంభం, కొత్త జీవితం మొదలుకానుంది” అని లలిత్ మోదీ ట్వీట్ చేశారు.
దీనిని బట్టి ఆయన కేవలం డేటింగ్ మాత్రమే చేస్తున్నామని చెప్తున్నారు. కేవలం క్లారిటీ కోసమే కానీ, పెళ్లి జరగలేదు. డేటింగ్ మాత్రమే చేసుకుంటున్నాం. అది కూడా ఏదో ఒక రోజు జరగొచ్చు” అని లలిత్ మోదీ అన్నారు.
లలిత్ మోదీ 2010 నుంచి లండన్ లోనే ఉంటున్నారు. ట్యాక్స్ ఎగవేత, మనీలాండరింగ్ అంశాల్లో ఇన్వెస్టిగేషన్లు తప్పించుకోవడానికి ఇలా చేశారనే ఆరోపణలు ఉన్నాయి.
Read Also : విజయ్ మాల్యాకు 4 నెలల జైలు శిక్ష, రూ.2 వేలు జరిమానా
సుశ్మితా సేన్ అంశానికొస్తే 1994లో మిస్ యూనివర్స్ కిరీటం దక్కించుకున్నారు. 1996లో దస్తక్ అనే సినిమాతో ఫిల్మ్ కెరీర్ ఆరంభించారు.
