Narendra Modi: చరిత్ర సృష్టించిన నరేంద్ర మోదీ.. నెహ్రూ కంటే ఎక్కువకాలం ప్రధానిగా.. దేశవ్యాప్తంగా బీజేపీ సంబరాలు
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) దేశంలోనే అత్యధిక కాలం నిరంతరంగా ప్రజల చేత ఎన్నికైన ప్రధానమంత్రిగా కొత్త రికార్డు సృష్టించారు.
narendra modi creates history surpasses nehru record as prime minister
- నెహ్రూ రికార్డును దాటిన మోదీ
- 4,399 రోజుల చారిత్రక మైలురాయి
- దేశవ్యాప్తంగా బీజేపీ సంబరాలు
Narendra Modi: భారత రాజకీయ చరిత్రలో మరో కీలక ఘట్టం నమోదైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) దేశంలోనే అత్యధిక కాలం నిరంతరంగా ప్రజల చేత ఎన్నికైన ప్రధానమంత్రిగా కొత్త రికార్డు సృష్టించారు. సుమారు 4,399 రోజుల పదవీకాలాన్ని పూర్తి చేసిన మోదీ, ఈ ఘనతతో తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ రికార్డును అధిగమించారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలు నిర్వహిస్తూ ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేపట్టాయి.
Thalliki Vandanam: తల్లికి వందనం.. అకౌంట్లో రూ.15వేలు పడేది ఎప్పుడో తెలిసిపోయింది
ఈ క్రమంలో తెలంగాణలో కూడా పలుచోట్ల పార్టీ కార్యకర్తలు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. మల్కాజిగిరి ఆనంద్‌బాగ్‌లోని శివాలయంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రధాని మోదీ దీర్ఘాయుష్షు, సంపూర్ణ ఆరోగ్యంతో దేశానికి మరిన్ని సంవత్సరాలు సేవలందించాలని ఆకాంక్షించారు. ప్రజాసేవ, సుశాసనం, జాతీయ భద్రత, అభివృద్ధి వంటి అంశాల్లో మోదీ నాయకత్వం దేశానికి కొత్త దిశను చూపిందని ఆయన పేర్కొన్నారు.
గత పన్నెండు సంవత్సరాల్లో భారత్‌ను ప్రపంచ ఆర్థిక శక్తుల జాబితాలో అగ్రస్థానాలకు చేర్చడంలో మోదీ కీలక పాత్ర పోషించారని బీజేపీ నేతలు అభిప్రాయపడ్డారు. ‘వికసిత్ భారత్’ లక్ష్యంతో దేశం వేగంగా ముందుకు సాగుతోందని, తెలంగాణలోని ప్రతి జిల్లా, మండలంలో కార్యకర్తలు ఈ చారిత్రక రోజును పండుగలా జరుపుకుంటున్నారని తెలిపారు. మోదీపై ప్రజల ఆదరణ, దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుతూ ప్రత్యేక హారతులు సమర్పించారు.
