Norovirus: కేరళలో నమోదవుతున్న నోరోవైరస్ కేసులు, లక్షణాలు
పరిశుభ్రతతోనే మనల్ని మనం కాపాడుకోగలమంటున్నారు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్. నోరో వైరస్ అనే కొత్త వైరస్ బయటపడటంతో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. వడదెబ్బ లక్షణాలతో ఉండే ఈ వైరస్ ప్రమాద తీవ్రతను ఇంకా అంచనా వేయలేకపోతున్నారు.
- Subhan Ali Shaik
- Published On : June 6, 2022 / 07:06 PM IST
Norovirus In Kerala
Norovirus: పరిశుభ్రతతోనే మనల్ని మనం కాపాడుకోగలమంటున్నారు కేరళ ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్. నోరో వైరస్ అనే కొత్త వైరస్ బయటపడటంతో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. వడదెబ్బ లక్షణాలతో ఉండే ఈ వైరస్ ప్రమాద తీవ్రతను ఇంకా అంచనా వేయలేకపోతున్నారు.
కలుషిత ఆహారం, నీరు, ఉపరితలాల ద్వారా వైరస్ సంక్రమించే అవకాశం ఉన్నందున పరిశుభ్రత పాటించాలని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ కోరారు.
లక్షణాలు:
నోరోవైరస్ అనేది డయేరియాను ప్రేరేపించే రోటవైరస్ లాంటిది. ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన గ్యాస్ట్రోఎంటెరిటిస్‌కు అత్యంత సాధారణ కారణమైన వైరల్ అనారోగ్యం. విరేచనాలు, వాంతులు, తలనొప్పులు, ఒంటి నొప్పుల తీవ్రంగా ఉండటం దీనిని లక్షణాలు.
Read Also : కేరళలో మరోసారి నోరోవైరస్ కేసులు.. ఇద్దరు చిన్నారుల్లో గుర్తింపు
కొన్ని సందర్భాల్లో ద్రవాలు పూర్తిగా కోల్పోయి.. నిర్జలీకరణానికి దారితీస్తుంది. మల విసర్జన తర్వాత సబ్బుతో పదేపదే చేతులు కడుక్కోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని ప్రజలను కోరుతూ రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది.
నోరోవైరస్ ఇన్ఫెక్షన్ పేగు మంట, పోషకాహార లోపంతో సంబంధం కలిగి ఉందని, దీర్ఘకాలిక అనారోగ్యానికి కారణమవుతుందని కనిపించిన ఆధారాలు సూచిస్తున్నాయి.
కేరళలో మొట్టమొదటిగా నమోదైన నోరోవైరస్ వ్యాప్తి గతేడాది జూన్‌లో అలప్పుజా జిల్లాలో మొదటిగా కనిపించింది. అలప్పుజా మునిసిపాలిటీ, సమీప పంచాయతీల నుండి 2021లో నోరోవైరస్‌తో సంబంధం ఉన్న తీవ్రమైన డయేరియా వ్యాధుల 950 కేసులు నమోదయ్యాయి. వ్యాధి వ్యాప్తి నెలన్నర పాటు ఉందని తెలిసింది.
