Poonam Pandey: హాస్పిటల్లో పూనమ్ పాండే.. భర్త అరెస్ట్
పూనమ్ పాండే భర్త శాం బాంబేను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. తనపై దాడికి పాల్పడుతున్నాడంటూ పూనమ్ పాండే కంప్లైంట్ చేయడంతో అదుపులోకి తీసుకున్నారు.
- Subhan Ali Shaik
- Updated on- November 9, 2021 / 06:43 AM IST
Poonam Pandey
Poonam Pandey: పూనమ్ పాండే భర్త శాం బాంబేను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. తనపై దాడికి పాల్పడుతున్నాడంటూ పూనమ్ పాండే కంప్లైంట్ చేయడంతో అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత పూనమ్‌ను.. ముంబైలోని హాస్పిటల్ కు పంపించారు.
తనపై దాడికి పాల్పడుతున్నాడంటూ.. పూనమ్ చెప్పడం ఇది తొలిసారేం కాదు. గతేడాది సెప్టెంబరులో ఇదే విషయంలో శిక్షను అనుభవిస్తున్న అతనికి గోవా కోర్టు బెయిల్ ఇచ్చి విడుదల చేసింది. నిర్మాత అయిన తన భర్త తనను వేదిస్తున్నాడని, దాడికి పాల్పడుతున్నాడని అప్పట్లోనూ ఇదే రకమైన ఫిర్యాదు చేసింది.
ఫిల్మ్ షూట్ కోసం సౌత్ గోవాలోని కనకోనా గ్రామం వెళ్లారు. అక్కడ జరిగిన ఘటన కారణంగా అతనిపై సెక్షన్స్ 353, 506, 354 ప్రకారం కేసు ఫైల్ అయింది. వారు ఉండే హోటల్ లో పూర్తి ఎంక్వైరీ చేసిన తర్వాతే అతణ్ని అరెస్టు చేసినట్లు తెలిపారు.
………………………………………: మైపాడు బీచ్‌లో జలకన్య కలకలం.. వైరల్ వీడియో!
నషా, ద జర్నీ ఆఫ్ కర్మా, మాలినీ అండ్ కో అనే బాలీవుడ్ సినిమాల్లో నటించారు పూనమ్ పాండే. సెప్టెంబర్ నెలలోనే వీరి వివాహ వార్షికోత్సవం జరిగింది.
