Rashmika Mandanna : రష్మిక మార్ఫింగ్ వీడియో.. సోషల్ మీడియా వేదికలకు చట్టపరమైన సూచనలు చేసిన కేంద్రం

Rashmika Deepfake Video Effect: నటి రష్మిక మార్ఫింగ్ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో కేంద్రం సోషల్ మీడియా వేదికలకు కేంద్రం పలు సూచనలు చేసింది. నిబంధనలు ఉల్లంఘిస్తే పడే శిక్ష, జరిమానాలను గుర్తు చేసింది.

Rashmika Deepfake Video Effect

నటి రష్మిక మందన్న మార్ఫింగ్ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో కేంద్రం సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్‌లకు సూచనలు జారీ చేసింది. చట్టపరమైన నిబంధనలతో పాటు అలాంటి వీడియోలు రూపొందించి సర్క్యులేట్ చేస్తే వేసే జరిమానాలను గుర్తు చేసింది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో ఆందోళన రేకెత్తించిన నటి రష్మిక డీప్‌ఫేక్ వీడియో వైరల్ అయిన నేపథ్యంలో ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా వేదికలకు రూల్ రిమైండర్లను పంపింది. వాటిలో డీప్‌ఫేక్‌లను కవర్ చేసే చట్టపరమైన నిబంధనలు వాటిని అధిగమిస్తే వేసే జరిమానాలను నొక్కి చెప్పింది.

Also Read: రష్మిక ఫేక్ వీడియోపై సెలబ్రిటీలు సీరియస్.. తనకి సపోర్ట్ చేస్తున్నందుకు రష్మిక రియాక్షన్..

ప్రభుత్వం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 లోని సెక్షన్ 66D ని ఉదహరించింది. సోషల్ మీడియా వేదికలపై మార్ఫింగ్ వీడియోలు చేయడం.. వారిని సర్క్యులేట్ చేయడం వంటి వాటికి పాల్పడినట్లు ప్రూవ్ అయితే మూడు సంవత్సరాల జైలు శిక్షతో పాటు లక్ష రూపాయలు జరిమానా విధించబడుతుందని స్పష్టం చేసింది. రష్మిక ఎలివేటర్‌లోకి వెళ్లినట్లు చూపించిన వీడియో వాస్తవానికి బ్రిటిష్-ఇండియన్ ఇన్ ఫ్లుయెన్సర్ జారా పటేల్ వీడియోగా తెలిసింది. డీప్‌ఫేక్ టెక్నాలజీని ఉపయోగించి విజువల్స్ మార్ఫింగ్ చేశారు.

Also Read: రష్మిక మార్ఫింగ్ వీడియోలో ఉన్న జారా పటేల్ ఎవరు?.. వీడియోపై ఆమె స్పందన ఏంటంటే?

ట్రెండింగ్ వార్తలు