డాక్యుమెంట్లతో పాటు, కారుకు నెంబర్ ప్లేట్ లేదనే కారణంతో కారును సీజ్ చేశారు. పోర్ష్ 911 స్పోర్ట్స్ కారును గుజరాత్ అహ్మదాబాద్‌లోని హెల్మెట్ క్రాస్ రోడ్ వద్ద చెకింగ్ నిమిత్తం ఆపారు. దానికి నెంబర్ ప్లేట్ లేదు, డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తిని మిగిలిన డాక్యుమెంట్లు అడిగితే చేతులెత్తేశాడు. డిప్యూటి కమిషనర్ ఆఫ్ పోలీస్ కారును ఆర్టీఓ ఆఫీసుకు తరలించమని ఆదేశాలు జారీ చేశారు.
‘రూ.2కోట్లు విలువ చేసే ఈ కారుకు గతంలో రూ.9.8లక్షల ఫైన్ ఉంది. వీటి నుంచి తప్పించుకోవడానికి నెంబర్ ప్లేట్ లేకుండా తిప్పుతున్నారు. అందుకే కారుకు మోటార్ వెహికల్ చట్టం ప్రకారం మెమో ఇచ్చి ఆర్టీఓకు తరలించాం. మొత్తం ఫైన్‌ను చెల్లించి ఆ తర్వాత కారును తీసుకెళ్లమని చెప్పాం’ అని పోలీసు ఉన్నతాధికారి వెల్లడించారు.
భారీ మొత్తంలో ఫైన్ ఉండటంతో పోలీసులు వసూలు చేయకుండా ఆర్టీఓ ఆఫీసుకు అప్పగించారు. ఫైన్ చెల్లించిన రసీదు చూపిస్తేనే కారు విడుదల చేస్తారట. దాంతో పాటు నెంబర్ ప్లేట్ కూడా తప్పనిసరిగా కారుకు ఉండేలా చూస్తామని అధికారులు చెబుతున్నారు.