IUML Kader Mohideen : విజయ్ మాస్టర్ ప్లాన్.. డీఎంకేకి గుడ్ బై కొట్టిన IUML..
IUML Kader Mohideen : డీఎంకే కూటమికి ఐయూఎంఎల్ గుడ్‌బై చెప్పింది. సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి పూర్తి మద్దతును ప్రకటించింది. ఈ మేరకు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ జాతీయ అధ్యక్షుడు కాదర్ మొహిదీన్ తీర్మానాన్ని ఆమోదించినట్టు తెలిపారు.
IUML Kader Mohideen
- డీఎంకే కూటమితో కొనసాగే ప్రసక్తే లేదు : IUMAL ఛీప్ మొహిదీన్
- టీఎంకే కూటమికి అన్ని విధాలు అండగా ఉంటాం
- అందుకే టీవీఎంకేకు మద్దుతు ఇవ్వాలని నిర్ణయిచాం
IUML Kader Mohideen : తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకేకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితుల్లో డీఎంకే నేతృత్వంలోని సెక్యులర్ ప్రోగ్రెసివ్ అలయన్స్ (SPA)తో కొనసాగేది లేదని ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUMAL) ప్రకటించింది.
శనివారం (జూన్ 20) చెన్నైలో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశం అనంతరం ఐయూఎంఎల్ జాతీయ అధ్యక్షుడు కాదర్ మొహిదీన్ ఈ విషయాన్ని వెల్లడించారు. అంతేకాదు.. సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వానికి తమ మద్దతు కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.
ఇటీవల తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఐయూఎంఎల్ డీఎంకే కూటమి తరపున పోటీ చేసింది. కూటమితో మళ్లీ అధికారంలోకి రావాలని ఆశించినప్పటికీ ఫలితాలు భిన్నంగా వచ్చాయని మొహిదీన్ చెప్పారు.
ఆ తర్వాత రాజకీయ పరిణామాల దృష్ట్యా పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్నామని, ఆ తర్వాతే టీవీకేకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఈ నిర్ణయాన్ని డీఎంకే అధ్యక్షుడు ఎం.కే. స్టాలిన్‌కు సైతం వివరించినట్లు మొహిదీన్ చెప్పారు.
టీవీకే ప్రభుత్వానికి తమ మద్దతును ఇవ్వని పక్షంలో అది రాష్ట్రంలో గవర్నర్ పాలనకు దారితీసేదని, పరోక్షంగా బీజేపీకి కలిసివస్తుందని తమ పార్టీ భావించిందని ఆయన పేర్కొన్నారు. అందుకే టీవీకేకు ఎలాంటి షరతులు గానీ డిమాండ్లు లేకుండా తమ ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతును
అందించినట్టు తెలిపారు.
అదేవిధంగా, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీకి మంత్రివర్గంలో అవకాశం కల్పించిన సీఎం విజయ్, టీవీకే శ్రేణులకు మొహిదీన్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా టీఎంకే తమ మద్దుతను ప్రకటిస్తూ ప్రత్యేక తీర్మానం ఆమోదించామన్నారు. స్థానిక సంస్థలు, ఉప ఎన్నికల నేపథ్యంలో భవిష్యత్ ఎన్నికల పొత్తులపై అధికారిక ప్రకటన వచ్చాక సరైన నిర్ణయం తీసుకుంటామని ఐయూఎంఎల్ ఒక ప్రకటనలో వెల్లడించింది.
తాము డీఎంకే కూటమిలో ఉన్నప్పుడు ఆ కూటమికి అండగా ఉన్నామని, ఇప్పుడు, టీవీకే కూటమిలో ఉండి ఈ కూటమికి కూడా అండగా ఉంటామన్నారు. ప్రస్తుత ప్రభుత్వం కొనసాగాలని తమ పార్టీ కోరుకుంటోందని ప్రజలు టీవీకే పరిపాలనను స్వాగతిస్తున్నారని మొహిదీన్ అన్నారు.
