Alcohol Ban: అక్కడ పెళ్లికానివారు తాగితే రూ.5 వేలు ఫైన్.. చెప్తే రూ.2 వేలు గిఫ్ట్.. ఆ ఊళ్ళో వింత రూల్స్
యువత మద్యానికి(Alcohol Ban) బానిసలు కాకుండా ఉండేందుకు ఆ ఊళ్ళో వింత రూల్స్ పెట్టారు.
tamil nadu village imposes fine on bachelor for drinking alcohol
- బ్యాచిలర్స్ తాగితే భారీ జరిమానా
- సమాచారం ఇస్తే నగదు బహుమతి
- గొడవలు చేస్తే భారీ ఫైన్
Alcohol Ban: తమిళనాడులోని నాగపట్నం జిల్లా కీళ్వేలూర్ సమీపంలో గల విలుండమావడి గ్రామంలో మత్స్యకార సంఘం పెద్దలు మద్యం మహమ్మారిని అరికట్టేందుకు ఒక వినూత్న నిర్ణయం తీసుకున్నారు. ఊర్లో తాగుడు(Alcohol Ban) వల్ల గొడవలు పెరిగిపోవడం, ముఖ్యంగా యువత చెడుదారుల్లో పయనిస్తుండటంతో గ్రామ పంచాయతీ ఈ కఠిన నిబంధనలను అమలులోకి తెచ్చింది. గ్రామంలో శాంతిభద్రతలను కాపాడటంతో పాటు యువత భవిష్యత్తును సరిదిద్దడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
బ్యాచిలర్స్‌కు నో డ్రింకింగ్, ఇన్ఫార్మర్కు రూ.2 వేల రివార్డ్:
గ్రామ కమిటీ నిబంధనల ప్రకారం.. పెళ్లి కాని యువకులు ఎవరైనా మద్యం సేవిస్తూ దొరికితే వారికి రూ. 5,000 జరిమానా విధిస్తారు. అంతేకాకుండా, ఎవరైనా యువకులు దొంగతనంగా మద్యం తాగుతున్నారని ఆధారాలతో సమాచారం ఇస్తే, ఆ ఇన్ఫార్మర్కు రూ. 2,000 నగదు బహుమతిగా అందిస్తారు. ఈ మేరకు నిబంధనలతో కూడిన ఒక పెద్ద బ్యానర్‌ను కూడా ఊరి మధ్యలో ఏర్పాటు చేయడం విశేషం.
పెళ్లైన వారికి మినహాయింపు కానీ..:
ఈ మద్యపాన నిషేధం నుంచి పెళ్లైన పురుషులకు కొంత మినహాయింపు ఇచ్చినప్పటికీ కఠినమైన షరతులు విధించారు. వివాహితులు మద్యం తాగవచ్చు, కానీ తాగి వచ్చి ఇళ్లలో గానీ, రచ్చబండ వద్ద గానీ గొడవలు చేస్తే రూ. 5,000 ఫైన్ తప్పదు. గ్రామ పెద్దలు తీసుకున్న ఈ వినూత్న నిర్ణయంతో ఊరిలో గొడవలు తగ్గి ప్రశాంతత లభిస్తుందని మహిళలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
