Robbery
Kochi to Delhi: బడా వ్యాపారవేత్తల్లా ఫోజిస్తూ.. ముగ్గురు వ్యక్తులు కేరళలోని కొచ్చి నుంచి ఢిల్లీకి ఓ దొంగల ముఠా దిగింది. ఫిబ్రవరి 9నే ఒక వ్యక్తి కోస్టల్ టౌన్ లో దిగినట్లు ఎయిర్‌లైన్ కంపెనీ ధ్రువీకరించింది.
ఏప్రిల్ 21 నుంచి వరుసగా ముగ్గురు సభ్యుల ముఠా నాలుగు ఇళ్లలో చోరీలకు పాల్పడింది. గతంలోనూ ఇవే తరహాలో దోపిడీలకు పాల్పడి ఉండొచ్చని సోమవారం అరెస్టు చేసిన నివేదికలో పేర్కొన్నారు. చుట్టువైపుల పరిసరాల్లో ఎవరూ లేని ఒంటరి ఇళ్లనే టార్గెట్ గా చేసుకుని దొంగతనాలకు పాల్పడేవారు. పగటిపూట రెక్కీ నిర్వహించి.. రాత్రి సమయాళ్లో పొడవాటి స్క్రూ డ్రైవర్ నే ఆయుధంగా రెచ్చిపోయేవారు.
ఇదే క్రమంలో చోరీకి గురైన ఓ ఇంటి బయట సీసీటీవీ ఫుటేజీల సహాయంతో నిందితులను పట్టుకునేందుకు స్కెచ్‌లు సిద్ధం చేశారు పోలీసులు. ముగ్గురిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టి దుండగులు బస చేసిన లాడ్జిలో సోమవారం నిందితులను పట్టుకున్నారు. పక్కా సమాచారం మేరకు పోలీసులు ఎర్నాకులంలోని ఓ రెస్టారెంట్‌లోకి ప్రవేశిస్తుండగా వారిని అదుపులోకి తీసుకున్నారు.
Read Also: బ్రిడ్జిని ఎత్తుకెళ్లిపోయిన దొంగలు
ఉత్తరప్రదేశ్‌కు చెందిన చంద్రబాన్ (38), ఉత్తరాఖండ్‌కు చెందిన మింటు బిశ్వాస్ (47) ప్రస్తుతం ఢిల్లీ నివాసి, యూపీకి చెందిన హరిచంద్ర (33)లను నిందితులుగా గుర్తించారు.
నిందితుల నుంచి రూ.8 లక్షల విలువైన 160 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.70 వేల నగదు, 411 డాలర్లు, రోలెక్స్‌తో పాటు 2 చేతి గడియారాలు, 4 మొబైల్ ఫోన్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఒక స్కూటర్‌ను కూడా స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.