clash between two groups of monkeys : కోతులు కొట్లాడితే..ఇద్దరు ఎలా చనిపోయారని ఆశ్చర్యపోతున్నారు. కానీ ఇదే జరిగింది. ఆ రెండు జంతువుల కొట్లాట ఇద్దరి మృతికి కారణమైంది. తాజ్ నగరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. Satsang Gali ప్రాంతంలో పాత ఇల్లు ఉంది. ఈ ఇంటిపై రెండు కోతులు వచ్చాయి. భీకరంగా పొట్లాడుకుంటున్నాయి.
ఇంటి యజమాని, మరో వ్యక్తి గోడ పక్కనే నిలబడి ఉన్నారు. కోతుల కొట్లాటలో అమాంతం గోడ కూలిపోయింది. నిలబడి ఉన్న ఆ ఇద్దరి వ్యక్తులపై శిథిలాలు పడిపోయాయి. దీంతో వారు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను GG Nursing Home కు తరలించినా లాభం లేకపోయింది. అప్పటికే వారు చనిపోయారని వైద్యులు వెల్లడించారు. చనిపోయిన వ్యక్తులను లక్ష్మణ్ తులసి, వీరాగా గుర్తించారు.
కొద్దిరోజులుగా భయంకరమైన ఘటనలు వెలుగు చూస్తున్నాయని, వెంటనే ఇక్కడి నుంచి కోతులను తరిమివేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. కోతులు స్థానికులను కాక పర్యాటకులను కూడా ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. గత ఏడాది ఒక కోతి రునుక్త గ్రామంలో తల్లి ఒడిలో ఉన్న పసికందును లాక్కెళ్లి చంపేసింది.
తాము పలు చర్యలు తీసుకుంటున్నామని, జంతు హక్కుల సంఘాల విషయంలో కొన్ని సమస్యలు వస్తున్నాయని ఆగ్రా మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ నవీన్ జైన్ వెల్లడించారు. . కోతులను అటవీ ప్రాంతంలోకి తరలించడానికి చర్యలు తీసుకుంటున్న క్రమంలో..green activists వల్ల కొన్ని సమస్యలు ఏర్పడ్డాయని తెలుస్తోంది. జిల్లా అధికారులు పలు హామీలు ఇచ్చినా..ఇంతవరకు అమలు కాలేదంటున్నారు అక్కడివారు.
ఇక్కడ పరిస్థితి భయానకంగా ఉందని స్థానికులు వెల్లడిస్తున్నారు. యమునా నది వెంబడి అనేక కోతులన్నాయని, పర్యాటకులు అరటిపండ్లు, రొట్టెలను వారికి తినిపిస్తారని పర్యావరణ కార్యకర్త రంజన్ శర్మ తెలిపారు.