Karnataka Girl: రాగి ముద్దల్లో విషం పెట్టి ఫ్యామిలీ మొత్తానికి తినిపించిన టీనేజర్
కుటుంబ సభ్యుల్లోనే సమానంగా చూడటం లేదని.. తనపై వివక్ష చూపిస్తున్నారంటూ విషమిచ్చి చంపేసింది ఓ టీనేజర్.
- Subhan Ali Shaik
- Published On : October 20, 2021 / 08:54 AM IST
Raagi Mudda Poisioned
Karnataka Girl: కుటుంబ సభ్యుల్లోనే సమానంగా చూడటం లేదని.. తనపై వివక్ష చూపిస్తున్నారంటూ విషమిచ్చి చంపేసింది ఓ టీనేజర్. 17ఏళ్ల ఆ యువతి చేసిన పనికి అమ్మ, నాన్న, బామ్మ, అక్క మృతి చెందగా 19ఏళ్ల అన్న ఒక్కడే హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకుని బయటపడ్డాడు.
ఇసముద్ర గ్రామంలో జరిగిన ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. రోజూ అలవాటులో భాగంగా డిన్నర్ లో రాగి ముద్దలు తినే వాళ్లు ఆమె చేసిన వాటిని తినేశారు. అందులో ఇన్‌సెక్టిసైడ్ కలిపిందనే సంగతి గుర్తించలేకపోయారు. నలుగురికి వాంతులతో అస్వస్థత మొదలైంది. వారికి రాగి ముద్దలు పెట్టి నిందితురాలు మాత్రం అన్నం, రసం మాత్రమే తినిందని పోలీసులు చెబుతున్నారు.
ఆహార పదార్థాల నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించి వైద్య పరీక్షలు నిర్వహించగా విషయం బయటపడింది. కుటుంబమంతా తిన్న రాగి ముద్దల్లోనే విషం కలిపి ఉందని తెలిసింది. చిన్నప్పటి నుంచి తాత, నానమ్మల ఇంట్లో పెరిగిన బాలిక మూడేళ్ల క్రితం నుంచే అమ్మ, నాన్నలతో కలిసి ఉంటుంది. కాగా, తన తోబుట్టువులతో పాటుగా కుటుంబసభ్యులు సమాదరణ కల్పించడం లేదని ఆరోపించింది నిందితురాలు.
……………………………………….: వైఎస్సార్ మొదలుపెట్టిన చోటి నుంచే షర్మిల పాదయాత్ర
తనకు అనారోగ్యంగా ఉన్న సమయంలోనూ పట్టించుకోలేదని.. అప్పుడు కూడా అన్నను, చెల్లెనే బాగా చూసుకున్నారని అధికారులకు చెప్పింది. అందుకే విషమిచ్చానని.. గతంలో ఒకసారి ఇలాగే చేసి ఫెయిల్ అయ్యానని బయటపెట్టింది. నిందితురాలు మైనర్ కావడంతో ఆమెను బాలికల రిమాండ్ హోంకు పంపించారు.
