ప్రేమికుల రోజు సుష్మా స్వరాజ్ బర్త్ డే : భర్త భావోద్వేగ ట్వీట్
- veegam team
- Published On : February 14, 2020 / 10:48 AM IST
ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజునే మాజీ మంత్రి, చిన్నమ్మగా..‘‘సూపర్ మామ్’’ అనిపించుకున్న సుష్మా స్వరాజ్ పుట్టిన రోజు. ఆమె విదేశాంగ శాఖామంత్రిగా పనిచేసే రోజుల్లో సామాన్యులు పెట్టిన ట్వీట్లకు కూడా వెంటనే స్పందించేవారు. వారి సమస్యలు తీర్చేవారు. ఫిబ్రవరి 14 ప్రేమికులు దినోత్సవం రోజు ఆమెపుట్టిన రోజు సందర్భంగా.. సుష్మా భర్త స్వరాజ్ కౌశల్ ఓ ఎమోషనల్ ట్వీట్ చేశారు.
సుష్మా స్వరాజ్ భర్త కౌశల్ స్వరాజ్ ట్విటర్ అకౌంట్‌లో వారి కుమార్తె బన్సూరీ స్వరాజ్ షేర్ చేసిన ఫొటో.. అభిమానులకు సుష్మ నిండైన రూపాన్ని గుర్తుకు తెస్తోంది. ‘‘హ్యాపీ బర్త్‌డే! మా జీవితాల్లోని సంతోషం సుష్మాస్వరాజ్’’ అంటూ కుటుంబ సభ్యులు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కేకు కట్ చేసేందుకు చేతిలో నైఫ్ పట్టుకుని చిరునవ్వు చిందిస్తున్న‘చిన్నమ్మ’ రూపం చూసి.. ‘‘ సూపర్ మామ్.. మీరెప్పుడూ మా హృదయాల్లో సజీవంగానే ఉంటారు’’ అంటూ నెటిజన్లు భావోద్వేగపూరిత ట్వీట్లు చేస్తున్నారు.
సుష్మాస్వరాజ్ భర్త స్వరాజ్ కౌశల్ ప్రముఖ న్యాయవాది. వీరిది ప్రేమ వివాహం 1975 జూలై 13న జరిగింది. సనాతన హరియాణ కుటుంబానికి చెందిన సుష్మా స్వరాజ్ ఎన్నో అడ్డంకులను అధిగమించి.. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి స్వరాజ్ కౌశల్‌ని వివాహం చేసుకున్నారు.
దేశంలో ఎమర్జెన్సీ అమలులోకి వచ్చిన తొలినాళ్లలోనే 1975 జూలై 13న వీరి వివాహం జరిగింది. ఎమర్జెన్సీ సమయంలో జైలుపాలైన సోషలిస్టు నాయకుడు జార్జి ఫెర్నాండెజ్ తరఫున వాదిస్తున్నప్పుడే సుష్మ, స్వరాజ్ కౌశల్ దగ్గరయ్యారు. 44 ఏళ్ల వివాహ బంధంలో స్వరాజ్ కౌశల్, ప్రతి విషయంలో సుష్మకు ఎంతో అంగా నిలబడ్డారు. వెన్నుదన్నుగా నిలబడ్డారు.
స్వరాజ్ కౌశల్ తన భార్యకు శుభాకాంక్షలు తెలుపుతూ శుక్రవారం చేసిన ట్వీట్ నెటిజన్లను ఉద్వేగానికి గురిచేస్తోంది. భారత విదేశాంగ మంత్రిగా పనిచేసిన సుష్మా స్వరాజ్ అనారోగ్యంతో 2019 ఆగస్టు 6న..తుదిశ్వాస విడిచారు.
Happy birthday ! @SushmaSwaraj – the joy of our lives.
-Bansuri Swaraj@governorswaraj pic.twitter.com/ommuPdvqo3— Governor Swaraj (@governorswaraj) February 13, 2020
