Apple Polishing Cloth: యాపిల్ పాలిషింగ్ క్లాత్.. కావాలంటే వేలల్లో వెచ్చించాల్సిందే

పాలిషింగ్ క్లాత్ కోసం ఎంత ఖర్చుపెడతాం.. మహా అయితే రూ.20, రూ.30 బాగా ఖర్చు పెట్టాలనుకుంటే రూ.100. అంతకుమించి పాలిషింగ్ క్లాత్ కోసం ఎవరు ఖర్చుపెడతారు.

Apple Polishing Cloth: పాలిషింగ్ క్లాత్ కోసం ఎంత ఖర్చుపెడతాం.. మహా అయితే రూ.20, రూ.30 బాగా ఖర్చు పెట్టాలనుకుంటే రూ.100. అంతకుమించి పాలిషింగ్ క్లాత్ కోసం ఎవరు ఖర్చుపెడతారు. కానీ, యాపిల్ అలా ఆలోచించలేదు. ప్రెస్టేజ్ కు సింబల్ గా భావించి యాపిల్ ప్రొడక్ట్ లను కొనుగోలు చేసేవాళ్ల కోసం కాస్ట్లీ క్లాత్ ను తీసుకొచ్చింది.

వేరే దేని కోసం వాడకుండా కేవలం పాలిషింగ్ కోసం మాత్రమే వాడే క్లాత్ ను రిలీజ్ చేసింది. దాని ఖరీదు అక్షరాల రూ.1900 అంట. దీనిని కళ్లద్దాల బాక్సులో పెట్టి ఇచ్చినట్లుగా ఫ్రీగా ఇచ్చేయరు. సపరేట్ గా కొనుక్కోవాల్సిందే. రూ.1900 ధర వెచ్చించి కొనుగోలు చేయలేని కాస్ట్లీ నిరుపేదలకు ఈఎంఐ ఆప్షన్ కూడా ఇస్తున్నారు. నెలకు రూ. 224 చొప్పున చెల్లించి సొంతం చేసుకోవచ్చు.

ప్రొడక్ట్ పై యాపిల్ ఏమంటుందంటే.. :
* కొత్త మ్యాక్‌బుక్స్, ఎయిర్‌పాడ్స్, హోమ్ మినీ డివైజ్‌లతో ప్రారంభించబడింది. * ఇది మైక్రోఫైబర్ పాలిషింగ్ వస్త్రం. ఇది ఐఫోన్, ఐప్యాడ్, మాక్‌బుక్ స్క్రీన్ డిస్‌ప్లేను శుభ్రపరుస్తుంది.
* పాలిషింగ్ క్లాత్ చాలా మృదువుగా.. రాపిడి చేయని మెటీరియల్ నుండి తయారు చేయబడింది.
* ఇది ఫోన్ గ్లాస్‌ పనితీరును దెబ్బతీయదని కంపెనీ తాజా ప్రకటనలో వెల్లడించింది.

……………………………………… : ఈ వలపు మలుపుల్లో సతమతము ‘సమ్మతమే’..

ట్రెండింగ్ వార్తలు