Saanve Megghana : సుబ్రహ్మణ్యుడి సన్నిధిలో తెలుగు నటి శాన్వి మేఘన.. ఆధ్యాత్మిక పర్యటన ఫోటోలు వైరల్
కర్ణాటక రాష్ట్రంలోని కుక్కే సుబ్రమణ్య దేవాలయాన్ని తెలుగు నటి శాన్వి మేఘన (Saanve Megghana) తన కుటుంబంతో కలిసి దర్శించుకుంది. స్వామి వారి దర్శనం చాలా బాగా జరిగిందని తెలిపింది. తనకు చాలా సంతోషంగా ఉందని, ఈ రోజును ఎన్నటికి మరిచిపోలేనని, ఎందుకంటే అమ్మ పుట్టిన రోజు అని చెప్పింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.












