Best Camera Smartphones : ఫోటోలు, వీడియోలకు ఫుల్ పర్ఫెక్ట్.. ఈ నెలలో రూ. 30వేల లోపు బెస్ట్ కెమెరా స్మార్ట్ఫోన్లు ఇవే..!
Best Camera Smartphones : భారత మార్కెట్లో రూ. 30వేల లోపు కెమెరా స్మార్ట్ఫోన్లు లభ్యమవుతున్నాయి. రెడ్మి, వివో, మోటరోలా, శాంసంగ్, నథింగ్ ఫోన్లు పవర్ ఫుల్ కెమెరాలు, OIS, టెలిఫోటో జూమ్, ఆకట్టుకునే ఫోటోగ్రఫీ ఫీచర్లతో కొనుగోలుదారులను ఆకట్టుకునేలా ఉన్నాయి.

Best Camera Smartphones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొంటున్నారా? మంచి కెమెరా ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే, ప్రస్తుతం భారత మార్కెట్లో రూ. 30వేల కన్నా తక్కువ ధరలో అద్భుతమైన కెమెరా ఫోన్లు ఉన్నాయి. హై-రిజల్యూషన్ సెన్సార్లు, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS), అల్ట్రా-వైడ్ కెమెరాలు, స్పెషల్ టెలిఫోటో లెన్స్‌లతో అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి. రెడ్మి నోట్ 15 ప్రో 5జీ నుంచి వివో V60e, నథింగ్ ఫోన్ 3a ప్రో వరకు ఫొటోగ్రఫీ వీడియోగ్రఫీని ఇష్టపడే కస్టమర్ల కోసం అనేక ఆప్షన్లు ఉన్నాయి. ఈ కేటగిరీలో కొన్ని బెస్ట్ కెమెరా-సెంట్రలైజడ్ స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. అవేంటో ఓసారి పరిశీలిద్దాం..

రెడ్మి నోట్ 15 ప్రో 5G :
హై రిజల్యూషన్ ప్రైమరీ కెమెరాతో రెడ్మి నోట్ 15 ప్రో 5జీ బెస్ట్ ఆప్షన్. ఇందులో 1/1.4-అంగుళాల సెన్సార్ సైజుతో 200MP మెయిన్ బ్యాక్ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 6.83-అంగుళాల 1.5K అమోల్డ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7400-అల్ట్రా చిప్సెట్తో రన్ అవుతుంది. 8GB వరకు ర్యామ్, 256GB స్టోరేజ్‌ను అందిస్తుంది. ఈ ఫోన్ 45W ఛార్జింగ్‌తో 6,580mAh బ్యాటరీ పవర్ అందిస్తుంది. మెయిన్ స్పెసిఫికేషన్లలో 200MP + 8MP రియర్ కెమెరాలు, 20MP సెల్ఫీ కెమెరా, 6,580mAh బ్యాటరీ అందిస్తుంది. భారత మార్కెట్లో 8GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 29,999కు లభిస్తుంది.

వివో V60e :
వివో V60e ఫోన్ బ్యాక్ సైడ్ కెమెరా ఫొటోగ్రఫీ, సెల్ఫీలు రెండింటిపై ఫోకస్ పెడుతుంది. కెమెరా సెటప్‌లో OISతో 200MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ ఆటోఫోకస్, ఏఐ ఆధారిత పోర్ట్రెయిట్ ఫీచర్లతో 50MP కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.77-అంగుళాల అమోల్డ్ డిస్ప్లే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7360 టర్బో ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. 12GB వరకు ర్యామ్, 256GB స్టోరేజ్ అందిస్తుంది.
6,500mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్‌కు డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68, IP69 రేటింగ్ కూడా అందిస్తుంది. ప్రధాన స్పెసిఫికేషన్లలో 200MP + 8MP రియర్ కెమెరాలు, 50MP ఫ్రంట్ కెమెరా, 6,500mAh బ్యాటరీ ఉంది. భారత మార్కెట్లో ఫ్లిప్‌కార్ట్‌లో డిస్కౌంట్లతో 8GB ర్యామ్ + 128GB మోడల్ ధర రూ. 29,999కు లభిస్తుంది. హై స్టోరేజ్, ర్యామ్ వేరియంట్లకు ధర ఇంకా ఎక్కువే ఉంటుంది.

మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ :
మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ 50MP ప్రైమరీ సెన్సార్, 13MP అల్ట్రా-వైడ్ కెమెరాతో డ్యూయల్-కెమెరా సెటప్ అందిస్తుంది. 32MP ఫ్రంట్ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్ చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 144Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల 1.5K అమోల్డ్ డిస్ప్లే ఉంది.

స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 4 చిప్సెట్తో రన్ అవుతుంది. 12GB వరకు ర్యామ్, 256GB స్టోరేజ్‌తో వస్తుంది. 7,000mAh బ్యాటరీ 68W ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ మోటోరోలా ఫోన్ IP68, IP69 రేటింగ్ కూడా అందిస్తుంది. భారత మార్కెట్లో 8GB ర్యామ్ + 128GB వేరియంట్ ధర రూ. 28,490కు లభిస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ F70 ప్రో 5జీ :
శాంసంగ్ గెలాక్సీ F70 ప్రో 5జీలో 50MP ప్రైమరీ సెన్సార్, 5MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP మాక్రో కెమెరాతో ట్రిపుల్ రియర్-కెమెరా సిస్టమ్ ఉంది. 12MP ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ హ్యాండ్‌సెట్‌లో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల సూపర్ అమోల్డ్ డిస్ప్లే ఉంది. స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 3 చిప్సెట్తో రన్ అవుతుంది. 45W ఛార్జింగ్‌తో 6,000mAh బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్ యూఐ 8.5పై రన్ అవుతుంది. భారత మార్కెట్లో 6GB ర్యామ్ + 128GB వేరియంట్ ధర రూ. 26,349కు లభిస్తుంది.

నథింగ్ ఫోన్ 3ఎ ప్రో :
స్పెషల్ టెలిఫోటో కెమెరా కోరుకునేవారికి నథింగ్ ఫోన్ 3a ప్రో అద్భుతంగా ఉంటుంది. ఇందులో 50MP ప్రైమరీ కెమెరా, 3x ఆప్టికల్ జూమ్‌తో 50MP టెలిఫోటో లెన్స్, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా ఉన్నాయి. 50MP సెల్ఫీ కెమెరా కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.7-అంగుళాల అమోల్డ్ డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. 12GB వరకు ర్యామ్, 256GB స్టోరేజ్అందిస్తుంది. ఇందులో 50W ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీ, నథింగ్ స్పెషల్ గ్లిఫ్ ఇంటర్ఫేస్ ఉన్నాయి. భారత మార్కెట్లో 8GB ర్యామ్ + 128GB వేరియంట్ ధర రూ. 29,999కు లభిస్తుంది.
