Badshah Wedding: రహస్యంగా పెళ్లి చేసుకున్న ర్యాప్ సింగర్ బాద్షా.. పెళ్లి కూతురు ఎవరో తెలుసా?
బాలీవుడ్ స్టార్ ర్యాపర్ బాద్షా, నటి ఇషా రిఖీ రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తోంది. సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ పెళ్లి జరిగింది. ఇషా రిఖీ తల్లి పూనమ్ రిఖీ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా పెళ్లికి సంబంధించిన ఫోటోలను పంచుకుంటూ ‘గాడ్ బ్లెస్ యూ’ అని క్యాప్షన్ ఇచ్చింది. దీంతో నెటిజన్స్ ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.









