Ferrari Luce : వావ్.. ఫెరారీ ఫస్ట్ ఫ్యూచర్ EV కారు.. ఒక్క ఛార్జ్‌తో 530కి.మీ రేంజ్.. 1050bhp పవర్‌తో రాకెట్ స్పీడ్!
Ferrari Luce : ఫెరారీ ఫస్ట్ ఫుల్ ‘లూస్’ ఎలక్ట్రిక్ సూపర్‌కారు వచ్చేసింది. అడ్వాన్స్ ఫీచర్లతో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఐదుగురు కూర్చునే ఎలక్ట్రిక్ సూపర్‌కార్. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 530 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు. ఫాస్ట్ ఛార్జ్ కూడా అవుతుంది. 4 ఎలక్ట్రిక్ మోటార్లు ఉన్నాయి.

Ferrari Luce : సూపర్ కారు.. సూపర్ కారు.. మార్కెట్లోకి ఫెరీరా ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది. సూపర్‌కార్ల తయారీ సంస్థ ఫెరారీ అత్యంత అడ్వాన్స్ టెక్నాలజీతో ఫస్ట్ ఫుల్ ఎలక్ట్రిక్ కారును రోమ్ నగరంలో ఆవిష్కరించింది. ఎలక్ట్రిక్ వాహనాల (EV) విభాగంలోకి ఫెరారీ అడుగుపెట్టడం ఇదే ఫస్ట్ టైమ్. ఫెరారీ పెట్రోల్, హైబ్రిడ్ కార్లను కూడా విక్రయిస్తోంది.

లూస్ ఫెరారీ ఫస్ట్ ఎలక్ట్రిక్ కారు మాత్రమే కాదు.. కంపెనీ ఫస్ట్ 4 డోర్లు, 5-సీట్ల కారు కూడా. సింగిల్ ఛార్జ్‌పై 530 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. పాత పెట్రోల్ కారులా కాకుండా పూర్తిగా కొత్త ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫామ్‌పై తయారైంది. విశాలమైన క్యాబిన్, చూసేందుకు చాలా లగ్జరీగా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ సూపర్‌కార్ ఫీచర్లు ఎలా ఉన్నాయో పూర్తి వివరంగా తెలుసుకుందాం..

4 మోటార్లు, 1,050 హార్స్పవర్, రాకెట్ స్పీడ్ :
ఫెరారీ ఈ ఎలక్ట్రిక్ కారు విషయంలో స్పీడ్, పవర్ విషయంలో ఏమాత్రం రాజీ పడలేదు.
పవర్ : ఈ కారులో 4 ఎలక్ట్రిక్ మోటార్లు ఉన్నాయి. ప్రతి చక్రానికి ఒకటి చొప్పున అన్ని కలిపి ఏకంగా 1,050 హార్స్పవర్ (hp) పవర్ జనరేట్ చేస్తాయి.

పికప్ : ఈ కారు రాకెట్ లాగా ఫాస్ట్ దూసుకుపోతుంది. కేవలం 2.5 సెకన్లలో 0 నుంచి గంటకు 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. గంటకు 0 నుంచి 200 కిలోమీటర్ల వేగాన్ని చేరుకునేందుకు కేవలం 6.8 సెకన్లు పడుతుంది.

హై స్పీడ్, అద్భుతమైన కంట్రోలింగ్ :
ఈ సూపర్‌కారు టాప్ స్పీడ్ గంటకు 310 కిలోమీటర్లకు పైగా ఉంటుంది. నాలుగు చక్రాలకూ వేర్వేరు మోటార్లు ఉంటాయి. కారులోని కంప్యూటర్ అవసరాన్ని బట్టి ప్రతి వీల్‌కు పవర్ పంపుతుంది. టర్నింగ్ వద్ద లేదా హైస్పీడ్ వెళ్లేటప్పుడు అద్భుతమైన కంట్రోలింగ్ అందిస్తుంది.

భారీ 122kWh బ్యాటరీ, 530కి.మీ రేంజ్ :
రేంజ్ : ఈ కారు బ్యాటరీని ఫెరారీ మారనెల్లోలోని హెడ్ క్వార్టర్లో రూపొందించి పరీక్షించింది. ఇందులో 122kWh సామర్థ్యం గల భారీ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 530 కిలోమీటర్లకు పైగా రేంజ్ అందిస్తుంది.

ఫాస్ట్ ఛార్జింగ్ : ఈ కారు 350kW వరకు సూపర్-ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. కేవలం 20 నిమిషాల్లో 70kWh వరకు ఛార్జ్ చేయగలదు.
కూలింగ్ సిస్టమ్ : ట్రాక్ రేసింగ్ కోసం అత్యంత అడ్వాన్స్ కూలింగ్ సిస్టమ్ ఉంది. హై స్పీడ్ డ్రైవింగ్ సమయంలో బ్యాటరీ వేడెక్కకుండా స్టేబుల్ పవర్ సప్లయ్ అందిస్తుంది.

ఇంజిన్ సౌండ్ రాదు.. :
సాధారణంగా ఎలక్ట్రిక్ బండ్లు సౌండ్ చేయవు. ఫెరారీ ఈ కారు కోసం స్పెషల్ సౌండ్ సిస్టమ్ అందిస్తుంది. ఫెరారీ కార్లలో ఆర్టిఫీషియల్ లేదా ఇతర ఇంజిన్ సౌండ్లు ఉండవు. ఎలక్ట్రిక్ మోటార్, గేర్‌బాక్స్ నుంచి జనరేట్ అయ్యే వైబ్రేషన్ సౌండ్ క్యాబిన్ లోపల ప్లే అవుతుంది. యాక్సిలరేటర్ నొక్కే ప్రెజర్ బట్టి కారు సౌండ్ కూడా మారుతుంది. ఈ కారులో పూర్తిగా గాజుతో చేసిన పైకప్పు ఉంటుంది. అతిపెద్ద వీల్స్ (ఫ్రంట్ 23-అంగుళాలు, బ్యాక్ 24-అంగుళాలు) ఉన్నాయి. ఎయిర్ ఫ్లోను తగ్గించేందుకు హైస్పీడ్ వెళ్లే కారు ఫ్రంట్ సైడ్ ఆటోమాటిక్ వంగే యాక్టివ్ గ్రిల్స్ ఉన్నాయి.

ఇంటీరియర్ లుక్ :
ఈ కారులో శాంసంగ్ డిస్ప్లే OLED స్క్రీన్లు ఉన్నాయి. డ్రైవింగ్ కోసం ఫెరారీ కీలక ఫీచర్లలో టచ్‌స్క్రీన్‌కు బదులుగా ఫిజికల్ బటన్ అమర్చారు. ఈ కారులో 21-స్పీకర్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, బిగ్ ట్రంక్ కూడా ఉంది.
