Nagadurga : సుకుమార్ సెలెక్ట్ చేసిన అమ్మాయి.. ఎవరీ నాగదుర్గ.. డ్యాన్సర్ నుంచి హీరోయిన్ గా..
సుకుమార్ నిర్మాణంలో ప్రియదర్శి పక్కన ఇడుపు కాయితం అనే సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ అయింది నాగదుర్గ. (Nagadurga)

సుకుమార్ సెలెక్ట్ చేసిన అమ్మాయి.. ఎవరీ నాగదుర్గ.. డ్యాన్సర్ నుంచి హీరోయిన్ గా..

తాజాగా సుకుమార్, బన్నీ వాసు నిర్మాణంలో ప్రియదర్శి హీరోగా ఇడుపు కాయితం అనే సినిమాని ప్రకటించారు.

ఈ సినిమాలో నాగదుర్గ హీరోయిన్ గా నటిస్తుంది.

సుకుమార్, బన్నీ వాసు ఈమె పాటలకు, డ్యాన్స్ కి ఫ్యాన్స్ అయ్యామని అందుకే సెలెక్ట్ చేశామని సినిమా ఓపెనింగ్ లో చెప్పారు.

దీంతో ఈ నాగదుర్గ ఎవరు అని ఆరా తీస్తున్నారు జనాలు.

డిగ్రీ పూర్తి చేసిన నాగదుర్గ మన తెలుగమ్మాయే. తెలంగాణ లోని నల్గొండకు చెందిన అమ్మాయి.

కూచిపూడిలో కూడా ప్రవేశం ఉంది. అనేక స్టేజి పర్ఫార్మెన్స్ లు కూడా ఇచ్చింది.

యూట్యూబ్ లో ప్రైవేట్ ఆల్బమ్స్ లో తెలంగాణ జానపదాలకు డ్యాన్స్ లు వేస్తూ డ్యాన్సర్ గా ఫేమస్ అయింది.

తిన్నా తిరం పడతలే, దారిపొంటత్తుండు, పేరుగల్ల పెద్ది రెడ్డి.. ఇలాంటి పలు ఫోక్స్ సాంగ్స్ తో సోషల్ మీడియాలో మంచి ఫేమ్ తెచ్చుకుంది.

సోషల్ మీడియాలో కూడా ట్రెడిషనల్ గా ఫొటోలు షేర్ చేస్తూ అందర్నీ ఆకట్టుకుంటుంది.

ఇటీవల కలివి వనం అనే ఓ చిన్న సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది నాగదుర్గ.

ప్రస్తుతం లవ్ ఓ లవ్ అనే తమిళ సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది.

ఇప్పుడు సుకుమార్ నిర్మాణంలో ప్రియదర్శి పక్కన ఇడుపు కాయితం అనే సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ అయింది.

ఈ సినిమా తర్వాత నాగదుర్గకు మరిన్ని తెలుగు సినిమా అవకాశాలు వచ్చే అవకాశం ఉంది.












Nagadurga
