Gold Rate Today : సీన్ రివర్స్.. ఉన్నట్లుండి బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..
Gold Rate Today : బంగారం, వెండి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ అలర్ట్. ఇవాళ వీటి ధరల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి.

బంగారం ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. అంతర్జాతీయంగా నెలకున్న ఉద్రిక్త పరిస్థితులు బంగారం ధరల ర్యాలీకి కారణమవుతున్నాయి. దేశీయ మార్కెట్లో నిన్న భారీగా పెరిగిన బంగారం ధరలు ఈ రోజు కూడా పెరిగాయి.

పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం ప్రపంచ దేశాల్లో ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తొంది. స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. అయితే, బంగారం, వెండి ధరల్లో కూడా భారీ మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 220 పెరగ్గా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 200 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం గోల్డ్ రేటు తగ్గింది. ఔన్సు గోల్డ్ పై 67డాలర్లు తగ్గింది. ప్రస్తుతం అక్కడ ఔన్సు గోల్డ్ 4,460 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలను పరిశీలిస్తే.. గురువారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. వెండి ధరల్లో ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. బుధవారం కిలో వెండిపై రూ.10వేలు పెరిగినప్పటికీ.. ఇవాళ స్థిరంగా కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతో పాటు తదితర ప్రాంతాల్లో ఇవాళ బంగారం ధరలో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. దీంతో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,46,890కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,34,650 వద్ద కొనసాగుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,47,040 వద్దకు చేరగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,34,800 వద్దకు చేరుకుంది. ముంబై, కోల్కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.1,46,890కు చేరగా.. 22 క్యారట్ల బంగారం రూ. 1,34,650 వద్దకు చేరింది.

వెండి ధరలో ఇవ్వాళ ఎలాంటి మార్పులు జరగలేదు. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,60,000 వద్దకు చేరింది. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి రేటు రూ.2,50,000వద్ద కొనసాగుతుండగా.. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,60,000 వద్ద కొనసాగుతుంది.

గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
