Gold Silver Rates Today : పండుగల వేళ పసిడి షాక్.. తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Silver Rates Today : హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, చెన్నై, బెంగళూరు, ఢిల్లీలో 24, 22 క్యారెట్ల పసిడి రేట్లు, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

1/8
Gold Price Today : పండుగల సీజన్‌లో బంగారం కొనుగోలు చేసేందుకు ప్లాన్ చేస్తున్నవారికి బిగ్ షాక్.. నవరాత్రులు, దసరా, బతుకమ్మ, దీపావళి వంటి పండుగలు సమీపిస్తున్న వేళ పసిడి ధరలు మరోసారి భగ్గుమన్నాయి.
2/8
పెళ్లిళ్లు, శుభకార్యాలు, పండుగల కోసం ఆభరణాలు కొనాలనుకునేవారికి ఇక కష్టమే.. అక్టోబర్ 10న హైదరాబాద్ సహా పలు ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం..
3/8
ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు : అక్టోబర్ 10న హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,50,720గా ఉంది. అదే సమయంలో 22 క్యారెట్ల పసిడి ధర రూ.1,38,160 వద్ద కొనసాగుతోంది. విజయవాడ, విశాఖపట్నంలోనూ ఇదే ధరలు నమోదయ్యాయి.
4/8
చెన్నై, బెంగళూరు నగరాల్లో కూడా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,50,720గా ఉండగా, 22 క్యారెట్ల రేటు రూ.1,38,160గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం ధరలు కొద్దిగా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,50,870గా, 22 క్యారెట్ల బంగారం రూ.1,38,310గా నమోదైంది.
5/8
వెండి ధరల్లో స్వల్ప మార్పులు : వెండి మార్కెట్‌ను పరిశీలిస్తే నగరాల వారీగా ధరల్లో తేడాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2,34,800గా కొనసాగుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి రూ.2,44,900కు చేరింది. చెన్నైలోనూ ఇదే ధర ఉంది.
6/8
ఈ రెండు నగరాల్లో అంతకుముందు వెండి ధర కిలోకు రూ.2.45 లక్షలుగా నమోదైంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.2,34,800గా ఉంది. గత రోజు ధర రూ.2,34,900తో పోలిస్తే స్వల్ప తగ్గుదల కనిపించింది.
7/8
బంగారం, వెండి, ప్లాటినం దిగుమతులపై బ్యాంకులు, నామినేటెడ్ ఏజెన్సీలకు వర్తించే జీఎస్టీ మినహాయింపును కేంద్రం రద్దు చేసి, 3 శాతం ఐజీఎస్టీ విధించినట్లు వచ్చిన ప్రకటనతో బంగారం ధరలపై ప్రభావం పడింది.
8/8
అయితే, అంతర్జాతీయ మార్కెట్ ధరలు, రూపాయి మారకం విలువ, ఇతర పన్నులు వంటి అంశాలు కూడా పసిడి ధరలను ప్రభావితం చేస్తాయి.