Gold-Silver Prices Today : పండుగ వేళ గోల్డెన్ ఛాన్స్.. భారీగా తగ్గిన బంగారం రేట్లు.. తులం ఎంతంటే?
Gold Silver Prices Today : బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్న వారికి బిగ్ అలర్ట్.. ఈ ఇవాళ గోల్డ్ రేట్లలో కీలక మార్పులు చోటు చేసుకున్నాయి.

దసరా పండుగ సందడి షురూ అయింది.. వచ్చే నెలలో దీపావళి పర్వదినం రానుంది.. వరుసగా రెండు ప్రధాన పండుగల వేళ బంగారం ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇవాళ కూడా గోల్డ్ రేటు తగ్గింది.

మంగళవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.160 తగ్గింది.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 150 తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లోనూ గోల్డ్ రేటు తగ్గింది. ప్రస్తుతం ఔన్స్ గోల్డ్ 4,121 డాలర్ల వద్దకు పడిపోయింది. మరోవైపు వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,49,020 వద్ద కొనసాగుతుండగా.. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం రూ.1,36,600 వద్ద కొనసాగుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,49,170 కాగా.. 22క్యారట్ల బంగారం ధర రూ.1,36,750 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,49,020కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,36,600 వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలను పరిశీలిస్తే.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,45,000 వద్ద కొనసాగుతుండగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,35,000కు చేరింది. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,45,000 వద్ద కొనసాగుతోంది.

గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి గమనించగలరు.
