Gold Silver Price Today : బంగారం, వెండి ధరల్లో ఊహించని మార్పులు.. ఏపీ, తెలంగాణలో నేటి ధరలు ఇవే..
Gold Silver Prices Today : దేశంలోని బంగారం, వెండి ధరల్లో ఇవాళ భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో గోల్డ్ రేటు తగ్గింది.

Gold Silver Prices Today : గత కొద్దిరోజులుగా బంగారం, వెండి ధరల్లో భారీ మార్పులు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఇవాళ కూడా గోల్డ్, సిల్వర్ ధరల్లో ఊహించని మార్పులు చోటు చేసుకున్నాయి.

శుక్రవారం ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. 10గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.2,940 పెరగ్గా.. 22 క్యారెట్ల బంగారంపై రూ. 2700 పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో మాత్రం బంగారం ధర తగ్గింది. ఔన్సు గోల్డ్ పై 27డాలర్లు తగ్గింది. దీంతో అక్కడ ఔన్సు గోల్డ్ రేటు 4,185 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

వెండి ధరలోనూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇవాళ కిలో వెండిపై రూ.5వేలు పెరిగింది. గత పది రోజుల్లో కిలో వెండిపై రూ. 30వేల తగ్గిన విషయం తెలిసిందే.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంతోపాటు తదితర ప్రాంతాల్లో 10గ్రాముల 24క్యారెట్ల బంగారం ధర రూ.1,48,580 వద్దకు చేరగా. 22క్యారట్ల 10గ్రాముల బంగారం రూ.1,36,200 వద్దకు పడిపోయింది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలను పరిశీలిస్తే.. దేశ రాజధాని ఢిల్లీలో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,45,820 కాగా.. 22 క్యారట్ల బంగారం ధర రూ.1,36,350 వద్ద కొనసాగుతోంది. ముంబై, కోల్కతా, చెన్నై నగరాల్లో 10గ్రాముల 24క్యారట్ల బంగారం ధర రూ.1,48,580కు చేరగా.. 22క్యారట్ల బంగారం రూ.1,36,200వద్దకు పడిపోయింది.

వెండి ధరలను పరిశీలిస్తే.. ఉదయం నమోదైన వివరాల ప్రకారం.. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణంలో కిలో వెండి ధర రూ.2,65,000 వద్దకు చేరగా.. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు నగరాల్లో ప్రస్తుతం కిలో వెండి రేటు రూ.2,55,000 వద్ద కొనసాగుతుండగా.. చెన్నైలో కిలో వెండి రేటు రూ.2,65,000 వద్ద కొనసాగుతోంది.

గమనిక : పైన పేర్కొన్న ధరలు ఉదయం మార్కెట్ ప్రారంభంలో ఉన్నవి మాత్రమే. ఈ గోల్డ్, సిల్వర్ రేట్లు మారుతూ ఉంటాయి. గమనించగలరు.
