Google Pixel 10 Price : ఏంది భయ్యా ఈ డిస్కౌంట్.. గూగుల్ పిక్సెల్ 10 మరి ఇంత తక్కువా? అమెజాన్‌లో ధర జస్ట్..!
Google Pixel 10 Price : పిక్సెల్ అభిమానులకు బంపర్ ఆఫర్.. గూగుల్ పిక్సెల్ 10పై అదిరిపోయే డిస్కౌంట్ అందిస్తుంది. రూ. 15వేలు తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలంటే?

Google Pixel 10 Price : కొత్త గూగుల్ పిక్సెల్ ఫోన్ కొనేవారికి అద్భుతమైన ఆఫర్. గూగుల్ లేటెస్ట్ జనరేషన్ స్మార్ట్‌ఫోన్‌లైన పిక్సెల్ 11 సిరీస్‌ను ఇటీవలే లాంచ్ చేసింది. ఈ లైనప్‌లో పిక్సెల్ 11, పిక్సెల్ 11 ప్రో, పిక్సెల్ 11 ప్రో XL పిక్సెల్ 11 ప్రో ఫోల్డ్ అనే 4 మోడళ్లు ఉన్నాయి. కొత్త ఫోన్ చాలా కాస్ట్ ఉంటుంది. అంతకన్నా తక్కువకు చూస్తుంటే మీరు పాత జనరేషన్ పిక్సెల్ 10 కొనేసుకోవచ్చు. ఈ పిక్సెల్ ఫోన్ కొనుగోలుపై ఏకంగా రూ. 15వేలు డిస్కౌంట్ పొందవచ్చు. ఇంతకీ ఈ డీల్ ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

అమెజాన్ ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ. 15వేల కన్నా ఎక్కువ డిస్కౌంట్ అందిస్తోంది. ఇలాంటి డీల్స్ ఎక్కువ రోజులు ఉండవు. ఆసక్తిగల కొనుగోలుదారులు ఇప్పుడే కొనేసుకోవడం బెటర్. ఈ డీల్ పిక్సెల్ 10 ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

గూగుల్ పిక్సెల్ 10 డీల్ :
భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 10 రూ. 79,999 ప్రారంభ ధరతో లాంచ్ అయింది. అమెజాన్ ప్రస్తుతం రూ. 12,003 డైరెక్ట్ డిస్కౌంట్ అందిస్తోంది. పిక్సెల్ 10 ధర రూ. 67,996కి తగ్గింది. అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో అదనంగా రూ. 3,399 ఆదా చేసుకోవచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ చేయడం ద్వారా మరింత తగ్గింపు పొందవచ్చు.

పిక్సెల్ 10 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్ 3,000 నిట్స్ టాప్ బ్రైట్నెస్, 6.3-అంగుళాల స్క్రీన్‌తో వస్తుంది. అలాగే, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ అందిస్తుంది. ఈ పిక్సెల్ ఫోన్ టెన్సర్ G5 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. 12GB వరకు ర్యామ్ 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ అందిస్తుంది. అంతేకాదు.. ఇందులో 4,970mAh బ్యాటరీ ఉంది. 30W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 15W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది.

ఫొటోగ్రఫీ విషయానికి వస్తే.. పిక్సెల్ 10 బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 48MP ప్రైమరీ కెమెరా, 13MP అల్ట్రావైడ్ లెన్స్ 10.8MP టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 10.5MP ఫ్రంట్-ఫేసింగ్ కెమెరాతో వస్తుంది.

పిక్సెల్ 10 కొనాలా? వద్దా? :
గూగుల్ పిక్సెల్ 10 ఫోన్ అడ్వాన్స్ స్మార్ట్ఫోన్లలో ఒకటి. సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్, కెమెరాలతో ఏఐ ఆధారిత ఫీచర్లతో వస్తుంది. ఫొటోగ్రఫీ ఇష్టపడే యూజర్లకు అద్భుతమైన ఆప్షన్. ప్రస్తుతం డిస్కౌంట్ ద్వారా పిక్సెల్ 10 తగ్గింపు ధరకే సొంతం చేసుకోవచ్చు. ఫ్లాగ్షిప్ గూగుల్ స్మార్ట్‌ఫోన్ కోరుకుంటే పిక్సెల్ 10 తీసుకోవడమే బెటర్.
