Priya saroj : స్టాండ్స్‌లో కాబోయే భార్య.. ఆమెను చూస్తూ మైదానంలో పెను విధ్వంసం సృష్టించిన కేకేఆర్ ప్లేయర్.. ఫోటోలు వైరల్
ఆదివారం లక్నోలోని ఎకానా స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో సూపర్ ఓవర్లో కేకేఆర్ విజయం సాధించింది. బ్యాటింగ్‌లో 83 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో తన జట్టుకు మెరుగైన స్కోరు అందించిన కేకేఆర్ ఆటగాడు రింకూ సింగ్ ఫీల్డింగ్‌లోనూ ఐదు క్యాచ్‌లు అందుకున్నాడు. కేకేఆర్ విజయంలో కీలక పాత్ర పోషించిన రింకూ సింగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. కాగా.. ఈ మ్యాచ్‌కు రింకూ సింగ్ కాబోయే భార్య, ఎంపీ ప్రియా సరోజ్ (Priya saroj) హాజరు అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.






